మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అబ్బబ్బా.. వరుడు ఎంత అదృష్టవంతుడో.. అతడి మెడలో వేసిన దండను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ABN, Publish Date - Apr 29 , 2024 | 04:43 PM

భారతీయ వివాహాలలో రకరకాల సాంప్రదాయాలు పాటిస్తుంటారు. ప్రాంతాలను బట్టి ఈ సాంప్రదాయాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా చట్టవిరుద్ధమైనప్పటికీ కట్నం వివాహ వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయింది. పెళ్లి సమయంలో వరుడికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది.

Viral Video: అబ్బబ్బా.. వరుడు ఎంత అదృష్టవంతుడో.. అతడి మెడలో వేసిన దండను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Garland with currency notes

భారతీయ వివాహాలలో (Wedding) రకరకాల సాంప్రదాయాలు పాటిస్తుంటారు. ప్రాంతాలను బట్టి ఈ సాంప్రదాయాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా చట్టవిరుద్ధమైనప్పటికీ కట్నం వివాహ వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయింది. పెళ్లి సమయంలో వరుడికి (Groom) ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి వారైనా నోరెళ్లబెట్టాల్సిందే. వరుడి మెడలో ఉన్న దండ చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


sahil_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఆ వీడియోలోని ఓ ఇంటి గోడపై ఓ వ్యక్తి నిల్చుని ఓ దండ అంచును పట్టుకున్నాడు. వేరే ఇంటి బాల్కనీలో ఉన్న వరుడి మెడలో ఉన్న పొడవాటి దండ అంత దూరం వరకు వ్యాపించింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ దండ మొత్తాన్ని రూ.500 నోట్లతో తయారు చేసినట్టు తెలిసి షాకవ్వాల్సిందే (Garland with currency notes). రూ.500 నోట్లతో అంత పెద్ద దండను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు 2.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ డబ్బు అంతా వరుడికి ఇచ్చిన కట్నమా``, ``ఆ నోట్లు మొత్తం కలిపితే ఎంత`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ ప్రశ్నలకు కొందరు స్పందిస్తూ.. రూ.27 లక్షలు అని, రూ.35 లక్షలు అని కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీడు కొడుకు కాదు.. ఆస్తి కోసం కన్న తండ్రిపై కిరాతక దాడి.. నరకయాతన అనుభవించిన తండ్రి మృతి..!


Shocking: మీ కళ్లను మీరే నమ్మలేరు.. చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2024 | 04:43 PM

Advertising
Advertising