Viral News: ఈ మొక్క వెరీ డేంజర్.. ముట్టుకుంటే మటాష్..
ABN, Publish Date - May 19 , 2024 | 08:04 PM
మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. మానవ మనుగడలో మొక్కలు, చెట్ల యొక్క పాత్ర ఎంతో కీలకం. ఈ భూమిపై ఉన్న మొక్కలు, చెట్లతోనే ఇప్పటి వరకు భూమి మనుగడ సాగిస్తోందని, లేకుంటే వాతావరణ మార్పులతో మనుషులు, రకరకాల జంతువులు భూమి నుంచి అంతరించిపోయి ఉండేవి.
మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. మానవ మనుగడలో మొక్కలు, చెట్ల యొక్క పాత్ర ఎంతో కీలకం. ఈ భూమిపై ఉన్న మొక్కలు, చెట్లతోనే ఇప్పటి వరకు భూమి మనుగడ సాగిస్తోందని, లేకుంటే వాతావరణ మార్పులతో మనుషులు, రకరకాల జంతువులు భూమి నుంచి అంతరించిపోయి ఉండేవి. అందుకే మొక్కలు నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని చెట్లు, మొక్కలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ కొన్ని మొక్కలను ముట్టుకుంటేనే చాలా ప్రమాదకరమని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రపంచంలో కొన్ని విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయట. బ్రిటన్‌లో అటువంటి ఒక విషపూరిత మొక్కను అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన మొక్కగా పిలువబడుతుంది.
Viral Video: బీచ్‌లో యువతికి షాక్.. ఎద్దుకు ఆహారం పెట్టాలని చూడగా.. చివరకు..
ఒలియాండర్ అనే మొక్క బ్రిటన్‌లోని అత్యంత ప్రమాదకరమైనదిగా హార్టికల్చరిస్ట్ ఫియోనా జెంకిన్స్ గుర్తించారు. ఈ మొక్క విషపూరితమైనదని మనుషులతో పాటు జంతువులకు ఈ మొక్కతో ఎంతో ప్రమాదమని జెంకిన్స్ తెలిపారు. ఒలియాండర్ మొక్క మధ్యధరా ప్రాంతానికి చెందినదని, వెచ్చని వాతావరణంలో ఇది పెరుగుతుందని వెల్లడించారు. ఈ మొక్కలో నక్షత్రాకారపు పువ్వులు పూస్తాయని, ఏడాది పొడవునా ఈ మొక్కకు పువ్వులు పూస్తాయని తెలిపారు. ఈ మొక్క యొక్క పువ్వులు చాలా రంగులలో ఉంటాయని.. దీంతో ఎంతో అందంగా కనిపించినా.. ఇవి ఎంతో ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలినట్లు జెంకిన్స్ పేర్కొన్నారు.
విషపూరితం
ఒలియాండర్ మొక్క చాలా విషపూరితమైనదని, దానిని కొద్దిగా తింటే వ్యక్తి లేదా జంతువు చనిపోవచ్చని ఫియోనా జెంకిన్స్ తెలిపారు. మొక్కను ముట్టుకున్నా ఎన్నో రకాల వ్యాధులు సోకే ప్రమాదముందని వెల్లడించారు. పిల్లలు, పెంపుడు జంతువులను ఈ మొక్కకు దూరంగా ఉంచాలని జెంకిన్స్ హెచ్చరించారు. ఈ మొక్కను ముట్టుకున్నా లేదా వీటి ఆకులు, పువ్వులు తిన్నా గుండె సంబధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒలియాండర్ మొక్క గాలిలోకి విషపూరిత మూలకాలను విడుదల చేస్తుందని అందుకే ఈ మొక్కలను కాల్చడం కూడా ఎంతో ప్రమాదకరమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కకు అన్ని విధాలుగా దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Viral Video: వీళ్లకు పెళ్లంటేనే ఇష్టం లేనట్లుంది.. దండలు మార్చుకుంటున్న వధూవరులను చూస్తే..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 19 , 2024 | 08:04 PM