కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకుని సమీపానికి వచ్చిన బైకర్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 07:18 PM

రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులపై కుక్కలు దాడి చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడూ ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు కూడా వాహనాలపై దాడులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకుని సమీపానికి వచ్చిన బైకర్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులపై కుక్కలు దాడి చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడూ ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు కూడా వాహనాలపై దాడులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నడిరోడ్డుపై ఓ గేదె ఉన్నట్టుండి తెగ రెచ్చిపోయింది. గేదే కదా ఏం చేయదులే అని అనుకుని ఓ బైకర్ సమీపానికి వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల రాకపోకలతో ఓ రహదారి రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ గేదె రోడ్డు మధ్యలో సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. వాహనదారులు దాన్ని పట్టించుకోకుండా వెళ్తుంటారు. అయితే ఇంతలో అటుగా వచ్చిన ఓ బైకర్.. గేదెకు సమీపంగా వెళ్తాడు. అయితే అతను దగ్గరికి రాగానే.. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న గేదె ఒక్కసారిగా రెచ్చిపోతుంది. బైకుపై (Buffalo attack on biker)దాడికి దిగుతుంది. కొమ్ములతో పొడవగానే బైకర్.. అదుపు తప్పి కిందపడిపోతాడు.

Private Jets: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానాలు కలిగి ఉన్న.. ఆ ఆరుగురు ఎవరో తెలుసా..

అయినా వదలని గేదె రోడ్డుపై పడి ఉన్న అతడిపైకి దాడికి దిగుతుంది. తర్వాత కొమ్ములతో రోడ్డు పక్కన విసిరేస్తుంది. ఈ ఘటన చూసిన చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అయితే గేదె ఆవేశం చూసి దగ్గరికి వెళ్లేందుకు సాహసించరు. అయితే వారిని చూడగానే గేదె ఆవేశంగా పొడవడానికి వస్తుంది. దీంతో వారంతా పరుగందుకుంటారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇన్నాళ్లూ కుక్కలతోనే సమస్య అనుకున్నాం.. ఇప్పుడు గేదెలు కూడా వచ్చి చేరాయి’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటనేనే భయంగా ఉంది.. బాబోయ్’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Fact Check : ఒక్కడే కొడుకు ఉన్నోళ్లు సంక్రాంతి రోజున కచ్చితంగా ఈ పని చేయాలా..?

Updated Date - Jan 09 , 2024 | 07:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising