ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:48 AM

దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లపై ఓ ఎద్దు హల్‌చల్ చేసింది. ఓ బైకర్‌కు చుక్కలు చూపించింది. మిగిలిన వారందరినీ భయంకంపితులను చేసి పరుగులు పెట్టించింది. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bull attacked a bike rider in Delhi

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రోడ్లపై ఓ ఎద్దు (Bull) హల్‌చల్ చేసింది. ఓ బైకర్‌ (Biker)కు చుక్కలు చూపించింది. మిగిలిన వారందరినీ భయంకంపితులను చేసి పరుగులు పెట్టించింది. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. exploring_life అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోను దేశ రాజధాని ఢిల్లీలో చిత్రీకరించారు. అత్యంత బిజీగా ఉన్న రోడ్డుపై ఓ ఎద్దు స్వైర విహారం చేసింది. ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళుతూ బైక్ మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది (Bull attacked a bike rider). తన తలతో వారిద్దరినీ ముందుకు తోసుకుంటూ వెళ్లింది. అలా కొద్ది దూరం తోసుకుని వెళ్లింది. వారిని కాపాడేందుకు చుట్టు పక్కల వారు ప్రయత్నించారు. దాంతో ఎద్దు వారిపై దాడికి యత్నించింది. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. రోడ్డుకు అవతలివైపు ఉన్న ఈ-రిక్షాలో కూర్చున్న ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేశారు. ``ఢిల్లీలో ఓ సాధారణ రోజు`` అంటూ ఆ వీడియోను పంచుకున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియోను రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బైకర్లకు సహాయం చేసే దయగల భారతీయ జీవి``, ``బైకర్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. అతడిని వేగంగా వెళ్లమని ప్రోత్సహించింది``, ``ట్రాఫిక్ క్లియర్ చేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: చాలా కొద్ది మందే ఈ పజిల్ సాల్వ్ చేయగలిగారు.. ఈ ఫొటోలో దాక్కున్న నత్తని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!


Viral: ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మెసేజ్.. రూ.220 కట్ అయినట్టు ఫాస్టాగ్ మెసేజ్.. అసలేం జరిగిందంటే..


Optical Illusion: మీ కళ్ల శక్తి ఏంటో తెలుసుకోండి.. ఈ ఫొటోలో దాక్కున్న పిల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 20 , 2024 | 08:48 AM

Advertising
Advertising
<