ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘బుల్లెట్‌’ గుడి

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:22 AM

ఇప్పటిదాకా అనేక గుళ్లు చూసి ఉంటారు కానీ, ఓ మోటార్‌సైకిల్‌కి గుడికట్టి పూజించడం ఎక్కడైనా చూశారా? ఈ చిత్రమైన ఆలయం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌నకు 50 కి.మీ దూరంలో ఉంది.

ఇప్పటిదాకా అనేక గుళ్లు చూసి ఉంటారు కానీ, ఓ మోటార్‌సైకిల్‌కి గుడికట్టి పూజించడం ఎక్కడైనా చూశారా? ఈ చిత్రమైన ఆలయం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌నకు 50 కి.మీ దూరంలో ఉంది.

ఒక పాత బుల్లెట్‌బండికి అక్కడ ధూప దీప నైవేద్యాలతో నిరంతరం పూజలు జరుగుతుం టాయి. ప్రతీరోజూ వందలాదిమంది దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కొత్తగా బైక్‌ కొన్న వారైతే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారట.


బైక్‌ నడిపే తమ భర్తలకు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడ మని మహిళలు ‘బుల్లెట్‌’ గుడికి వచ్చి, మందిరంలో ఉన్న చెట్టుకి ఎర్రటి దారం కడతారు. ఇంతకీ ఈ బుల్లెట్‌కి గుడి ఎందుకు కట్టారంటే... 1988లో ఓంసింగ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి 350సీసీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అప్పట్లో పోలీసులు అతను నడిపిన బుల్లెట్‌ బైక్‌ను కస్టడీలోకి తీసుకున్నారట. మర్నాడు విచిత్రంగా ఆ బైక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అదృశ్యమై ప్రమాదం జరిగిన చోటుకి వచ్చిందట.


పోలీసులు దాన్ని వెనక్కి తీసుకెళ్లినా తిరిగి అదేచోట కనిపించేదట. దాంతో గ్రామస్తుల నిర్ణయం మేరకు ఆ ప్రమాద స్థలంలోనే బైక్‌ కోసం గుడి కట్టి, దాన్ని ‘బుల్లెట్‌ బాబా ఆలయం’గా పిలవటం ప్రారంభించారు. అక్కడ చనిపోయిన ఓంసింగ్‌ ఆత్మ ప్రయాణికులను కాపాడుతుందని గ్రామస్తుల నమ్మకం. ఈ గుడికి కొందరు హెల్మెట్లను విరాళంగా ఇస్తుండటం విశేషం.

Updated Date - Nov 03 , 2024 | 10:22 AM