Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:48 PM

చాలా మంది చిన్న విషయాలను చెప్పడానికి కూడా పెద్దగా ప్రయాస పడుతుంటారు. అనవసరమైనదంతా చెబుతుంటారు. మరికొందరు అత్యంత ముఖ్యమైన విషయాలను కూడా సింపుల్‌గా చెప్పేస్తుంటారు. వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఫర్వాలేదు గానీ, వృత్తి జీవితంలో ఏ విషయం చెప్పడానికైనా లెటర్ పెట్టాల్సిందే.

Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!
Resignation letter

చాలా మంది చిన్న విషయాలను చెప్పడానికి కూడా పెద్దగా ప్రయాస పడుతుంటారు. అనవసరమైనదంతా చెబుతుంటారు. మరికొందరు అత్యంత ముఖ్యమైన విషయాలను కూడా సింపుల్‌గా చెప్పేస్తుంటారు. వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఫర్వాలేదు గానీ, వృత్తి జీవితంలో ఏ విషయం చెప్పడానికైనా లెటర్ పెట్టాల్సిందే. ఏ విజ్ఞప్తి చేసినా రాతపూర్వకంగానో, మెయిల్ ద్వారానో తెలియజేయాల్సిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌లో ఓ ఉద్యోగి (Employee) రాసిన రాజీనామా లేఖ (Resignation letter) చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది (Viral News).


cool_chefy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ పోస్ట్ షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నప్పుడు, కేవలం మూడు పదాలతో కూడిన రాజీనామా లేఖను ఇచ్చాడు. ముందుగా బాస్‌ని సంబోధిస్తూ.. ``డియర్ సార్`` అని రాశాడు. ఆ తర్వాత ``బై బై సార్`` అని రాశాడు. కింద తన సంతకం కూడా చేశాడు. ఈ రాజీనామా లెటర్ చూసి బాస్ షాకయ్యాడు. కేవలం మూడు పదాలతో కూడిన ఈ రాజీనామా లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


ఈ వెరైటీ రాజీనామ లేఖకు సంబంధించిన పోస్ట్‌ను 15 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2.2 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది జనరేషన్ జెడ్ రిజైన్ లెటర్``, ``సుత్తి లేకుండా సూటిగా``, ``కంటెంట్ కంటే సబ్జెక్ట్ ముఖ్యం``, ``కొన్నింటికి అనవసర వివరణలు అవసరం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!


Picture Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: వెనక్కి వెళ్తున్న లారీ.. బ్రేకులు ఫెయిల్ కాదు.. వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..!


Viral Video: తెల్ల పులి ముందు కుప్పకూలిన బాలుడు.. ఆ తర్వాతేం జరిగిందో చూస్తే కళ్లు తేలేయడం ఖాయం!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2024 | 02:49 PM

Advertising
Advertising
<