Puzzle: మీరు నిజంగా తెలివైన వారేనా?.. అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో కనిపెట్టండి..!
ABN, Publish Date - Mar 24 , 2024 | 08:11 PM
పజిల్స్ ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఎడారి కనబడుతోంది. అక్కడకు ముగ్గురు వ్యక్తులు గుర్రాల మీద వచ్చారు. అలాగే అక్కడ కొన్ని ఎడారి మొక్కలు, జంతువులు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ పెద్ద తప్పు ఉంది. అదేంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పేంటో కనిపెట్టెస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. తప్పేంటో తెలిసిపోతుంది. జీబ్రాలు ఎడారిలో మనుగడ సాగించలేవు. అవి గడ్డి భూముల్లో మాత్రమే బతకగలవు. కానీ, ఈ ఎడారి ఫొటోలో జీబ్రా ఉంది.
Viral Video: దొంగతనానికి ముందు యోగా.. ఓ ఆడ దొంగ వింత ప్రవర్తనకు పోలీసులు కూడా షాక్!
Updated Date - Mar 25 , 2024 | 05:12 PM