Puzzle: మీరు నిజంగా తెలివైన వాళ్లు అయితే.. ఈ ఫొటోలో తప్పేంటో 3 సెకెన్లలో కనిపెట్టండి..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:27 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Viral News).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ వాచీ కనిపిస్తోంది. ఆ వాచీలో టైమ్ రెండున్నర అవుతున్నట్టు చూపిస్తోంది. అయితే ఆ ఫొటోలో ఓ తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 3 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టెస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ తప్పు ఏంటో తెలిసిపోతుంది.