ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Robot Surgery: రోబోట్‌తో సర్జరీ.. పేగుల్లో రంధ్రాలు పడి పేషెంట్ మృతి!

ABN, Publish Date - Feb 27 , 2024 | 06:01 PM

రోబోట్‌తో సర్జరీ చేయడంతో తన భార్య మృతి చెందని ఆరోపిస్తూ అమెరికాలో ఓ వ్యక్తి ఆరోపించారు. ఆ రోబోట్ తయారు చేసిన సంస్థ ఇన్‌ట్యూటివ్ సర్జికల్‌పై కేసు వేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: రోబోట్‌తో సర్జరీ (Robot Surgery) చేయడంతో తన భార్య మృతి చెందని ఆరోపిస్తూ అమెరికాలో ఓ వ్యక్తి ఆరోపించారు. ఆ రోబోట్‌ను తయారు చేసిన సంస్థ ఇన్‌ట్యూటివ్ సర్జికల్‌పై కేసు (LawSuit) వేశాడు. బాధితుడు హార్వీ సల్ట్‌జర్ తెలిపిన వివరాల ప్రకారం, అతడి భార్య సాండ్రా కోలాన్ క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటోన్ రీజినల్ ఆసుపత్రిలో 2021లో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ సందర్భంగా డాక్టర్లు డావిన్సీ (DaVinci) అనే మల్టీ ఆర్మ్‌డ్, రిమోట్ కంట్రోల్డ్ రోబోట్‌ను వాడారు. దీని సాయంతో సన్నని కోతలతోనే ఆపరేషన్ చేయచ్చని కంపెనీ తన అడ్వర్‌టైజ్‌మెంట్లలో పేర్కొన్నట్టు హార్వీ పేర్కొన్నాడు.

Karl Rock: అమెరికా ప్లేన్‌లో ఇచ్చే ఫుడ్‌ను టేస్ట్ చేసిన ఫారినర్.. వెంటనే ఇండియన్ పుడ్ గుర్తొచ్చి..


అయితే, ఆపరేషన్ తరువాత సాండ్రా చిన్న పేగులు, ఇతర అవయవాల్లో రంధ్రాలు పడటంతో ఆమె ఆరోగ్య క్షీణించి 2022లో మరణించిందని ఆమె చెప్పుకొచ్చాడు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దర్యాప్తులోనూ ఇన్‌ట్యూటివ్ సర్జికల్ సంస్థ లోపాలు బయటపడినట్టు హార్వీ చెప్పుకొచ్చాడు. రోబోట్ కారణంగా గతంలో పలువురు పేషెంట్లకు అంతర్గతంగా గాయాలు అయినట్టు వెల్లడైందని చెప్పాడు.

Viral: దేవుడా.. గర్ల్‌ఫ్రెండ్ పేరును ఒంటిపై ఎక్కడ టాటూ వేయించుకున్నాడో చూస్తే..

మరోవైపు, ఎఫ్‌డీఏకు సమర్పించిన భద్రతా నివేదికల్లో ఇన్‌ట్యూటివ్ సర్జికల్స్..డావిన్స్‌తో జరిగిన ప్రమాదాల సంఖ్యను తక్కువ చేసి చూపించిందని కూడా ఆరోపించారు. అంతేకాకుండా, డావిన్సీతో గాయాలకు సంబంధించి ఇన్‌ట్యూటివ్ సర్జికల్ మొత్తం 93 కేసులు కూడా ఎదుర్కొంటోందని స్థానిక మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో హార్వీ కేసు స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 06:06 PM

Advertising
Advertising