ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pooja Utensils: చేత్తో రుద్దకుండానే పూజాసామాగ్రి తళతళా మెరవాలంటే ఇలా చేయండి..

ABN, Publish Date - Dec 08 , 2024 | 04:44 PM

పైసా ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే పదార్థాలతోనే పూజాసామాగ్రిని శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంతో సమయం పట్టదు. ఈ సారి రాగి, వెండి, ఇత్తడి సామాన్లను శుభ్రం చేసేందుకు ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.

Pooja Utensils

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండగలు, వ్రతాలు వచ్చినా గృహిణులు పూజా సామాగ్రిని శుభ్రం చేసే పనిలో నిమగ్రమవుతారు. రాగి, ఇత్తడి, వెండి ఇలా రకరకాల సామాన్లను శుభ్రం చేయడం పెద్ద సవాలే. ఎంత తోమినా చేతి రేఖలు అరగడం తప్ప ఓ పట్టా వాటికున్న జిడ్డు వదలదు. అందుకోసం నిమ్మకాయ, చింతపండు, మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లతో కుస్తీ పడుతుంటారు. అయితే, ఇంత శ్రమ లేకుండా కనీసం చేత్తో తాకాల్సిన అవసరమే లేకుండా ఈ పాత్రలన్నీ కొత్త వాటిలా మెరిస్తే ఎలా ఉంటుంది. నిజంగానే అలా చేసే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. ఇంట్లో లభించే వస్తువలతోనే శ్రమ లేకుండా ఈజీగా వీటిని ఈ పద్ధతిలో క్లీన్ చేసి చూడండి..


పెరుగు, పసుపుతో..

ఓ స్పూను పసుపు, రెండు స్పూన్ల పెరుగు, కాస్తంత బేకింగ్ సోడా, వేస్తే కొంత నిమ్మ రసం.. వీటన్నింటినీ ఓ గిన్నెలో కలుపుకుని పూజా సామాగ్రిపై ఓ పూతలా వేసి ఓ నిమిషం తర్వాత కడిగేయండి. రాగితో పాటు ఇత్తడి వస్తువులు కూడా మెరుగు పెట్టినట్టు మెరుస్తాయి.

వెండి వస్తువలకు..

ఒక గిన్నెలో నిమ్మకాయ రసం పిండి, అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేడి నీళ్లు పోసుకోవాలి. ఈ మిశ్రమంలో వెండి వస్తువులను ఒక 5 నిమిషాలుంచి మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. వాటిపై పేరుకుపోయి ఉన్న నలుపు ఇట్టు తొలగిపోతుంది.


చేతికి పనిలేకుండా..

ఇది మరింత ఈజీగా మురికిని వదిలించే చిట్కా.. వెనిగర్, డిటర్జెంట్ లిక్విడ్, నిమ్ముప్పు, ఉప్పుని సమానంగా తీసుకుని వాటికి కొంత నీటిని కలుపుకుని ఓ లిక్విడ్ లా తయారు చేసుకోవాలి. ఇందులో శుభ్రం చేయాల్సిన పాత్రలను ఉంచితే చిటికెలో నలుపు పోయి తళుక్కుమంటాయి.

దేవుడి విగ్రహాలకు..

నిత్యం ఎంతో నిష్టగా పూజించే దేవుడి ప్రతిమలు, విగ్రహాలను మాత్రం బయట దొరికే డిటర్జెంట్లు, కెమికల్స్ వాడకపోవడమే మంచిది. ఇది వాటిలోని శక్తిని తగ్గిస్తుందని గురువులు చెప్తున్న మాట. అందుకే వాటిని వీలైనంత సహజమైన పదార్థాలతోనే శుభ్రం చేసుకోవడం మేలు. విగ్రహాలపై ఉండే జిడ్డు ఓ పట్టాన వదలకపోతే.. విభూతిని చేత్తో తీసుకుని వాటిపై కాస్త రుద్దితే జిడ్డు మటుమాయమవుతుంది.

Viral Video: మృ‌త్యువును కొనితెచ్చుకోవడం అంటే ఇదే.. బైకుపై విన్యాసాలు చేస్తుండగా.. మధ్యలో..


Updated Date - Dec 08 , 2024 | 04:44 PM