Viral: బోరున విలపిస్తూ కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ గడపతొక్కిన వ్యక్తి.. ఏం జరిగిందని ఆరా తీస్తే..
ABN, Publish Date - May 04 , 2024 | 05:03 PM
తన కన్న కొడుకు పెంపుడు కుక్కను చంపేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతడిపై కేసు కూడా నమోదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషిపట్ల విశ్వాసంగా మసులుకునే ఒకే ఒక జంతువు కుక్క. పెంపుడు కుక్కలపై యజమానులకు కూడా అంతే ఆప్యాయత ఉంటుంది. అనేక మంది తమ పెంపుడు కుక్కలను కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. వాటికేమైనా అయితే గిలగిల్లాడిపోతారు. అలాంటి ఓ వ్యక్తి కుక్క కళేబరాన్ని చేతపట్టుకుని బోరున విలిపిస్తూ పోలిస్ స్టేషన్ గడప తొక్కాడు. అతడు చెప్పింది విని పోలీసులే షాకైపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: పాపం.. ఈ కుక్కకు చావు ముంచుకొస్తున్న విషయమే తెలీలా! షాకింగ్ వీడియో
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని సూరజ్‌పూర్ జిల్లా పోడి గ్రామానికి చెందిన శివమంగళ్ సాయి అనే ఓ వ్యక్తి ఇటీవల ఓ రోజు బోరున విలపిస్తూ తన కుక్క కళేబరాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్‌లో కాలుపెట్టాడు. కుక్కను తన కొడుకే పొట్టన పెట్టుకున్నాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. శివమంగళ్ చాలా ఏళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే, తన కుమారులిద్దరికీ కుక్క అంటే నచ్చేది కాదని అతడు చెప్పాడు. ఇటీవల తన కొడుకు సంత్‌ధాని తాను ఇంట్లో లేని సమయంలో కుక్కను చంపేశాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, కుక్క తన తల్లిపై దాడి చేస్తుందనే భయంతోనే కుక్కను చంపాల్సి వచ్చిందని సంత్‌ధారి చెప్పుకొచ్చాడు. కానీ, శిమమంగళ్ తన కొడుకు వాదనను తోసిపుచ్చాడు. తన కుక్క ఎవరిపైనా దాడి చేసి ఎరుగదని అతడు చెప్పాడు.
శివమంగళ్ ఇంట్లో లేని సమయంలో అతడి కుమారుడు సంత్‌ధారి ఆ కుక్కను బంతి తీసుకురమ్మనాడని పోలీసులు తెలిపారు. అది మాట వినకపోవడంతో పదునైన ఆయుధంతో కుక్కను పొడిచి చంపేశాడని చెప్పారు. అతడిపై సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. అనంతరం, అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
Updated Date - May 04 , 2024 | 05:10 PM