Viral Video: ప్రమాదానికి హాయ్ చెప్పడం అంటే ఇదే.. రైలు గేటుకు వేలాడుతూ రీల్.. చివరకు ఆమె ఏమైందంటే..
ABN, Publish Date - Dec 12 , 2024 | 03:31 PM
రీల్స్ రూపొందించి వ్యూస్, లైక్స్ పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలకు కూడా దిగుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్‌కు (Reels) చాలా మంది బానిసలుగా మారిపోయారు. రీల్స్ రూపొందించి వ్యూస్, లైక్స్ పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలకు (Dangerous Stunts) కూడా దిగుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో కూడా హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువతి రీల్ కోసం వీడియో రూపొందిస్తూ ప్రమాదం బారిన పడింది. ఆ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు (Viral Video).
dailystar ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో శ్రీలంకలోని కొలంబో (Colmbo)కు చెందినది. రైలులో ప్రయాణిస్తున్న ఓ చైనా యువతి సాహసానికి దిగింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువతి తెల్ల గౌను వేసుకుని వేగంగా వెళ్తున్న రైలు గేటుకు (Train Gate) వేలాడుతోంది. బాగా వెనక్కి వంగి ఉంది. రైలు లోపల ఉన్న వ్యక్తి ఆ యువతిని వీడియో తీస్తున్నాడు. ఆ యువతి అలా వంగి ఉండగా, ఓ చెట్టు కొమ్మలకు తగిలి కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు కేకలు పెట్టారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఆ రైలు తర్వాతి స్టాప్‌లో ఆగినపుడు ఆమె స్నేహితులు దిగి, వెనక్కి వెళ్లారు. గాయాల పాలైన ఆ యువతిని హాస్పిటల్‌కు తరలించారు. వైలర్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది మూర్ఖత్వం``, ``మీరు దీన్ని ఆస్వాదించారా లేదా?``, ``నేను కొంతమందిని చూసి ఆశ్చర్యపోతుంటా. వారి చెవుల మధ్య ఏమి ఉందో తెలియక`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..
Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 12 , 2024 | 05:43 PM