ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ ప్రియుడికి ముందు చూపు చాలా ఎక్కువ.. ప్రియురాలికి ఎలాంటి రింగ్ ఇచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ABN, Publish Date - Jul 06 , 2024 | 01:14 PM

ఏ అబ్బాయి అయినా తన ప్రియురాలికి ఖరీదైన ఉంగరం ఇచ్చి ప్రేమ ప్రపోజల్ చేయాలనుకుంటాడు. ఆ అరుదైన సందర్భం కోసం బంగారం లేదా వజ్రం చేసిన ఉంగరాన్ని సిద్ధం చేసుకుంటాడు. అయితే చైనాకు చెందిన ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు.

Love Proposal

ఏ అబ్బాయి అయినా తన ప్రియురాలికి ఖరీదైన ఉంగరం (Ring) ఇచ్చి ప్రేమ ప్రపోజల్ (Love Proposal) చేయాలనుకుంటాడు. ఆ అరుదైన సందర్భం కోసం బంగారం లేదా వజ్రం చేసిన ఉంగరాన్ని సిద్ధం చేసుకుంటాడు. అయితే చైనా (China)కు చెందిన ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. తాను ఇచ్చే ఉంగరం వందేళ్లు ఉండాలనుకున్నాడు. అందుకే సిమెంట్ ఉంగరాన్ని (Cement Ring) బహూకరించాడు. అరుదైన లోహాన్ని సిమెంట్‌తో కలిపి స్వయంగా ఓ ఉంగారాన్ని తయారు చేశాడు (Viral News).


చైనాకు చెందిన 36 ఏళ్ల గ్యూయు అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌కు సిమెంట్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నిర్మాణ రంగంలో పని చేసే గ్యూయు వాటర్ ప్రూఫింగ్ నాణ్యత కోసం సరికొత్తగా నానో సిలికాన్ అయాన్ (Nano silicon ion) పదార్థాన్ని కనుగొన్నాడు. ఇది ఎంతకాలమైనా నిలిచి ఉంటుంది. ఈ పదార్థాన్ని 2022లో ఒలింపిక్స్ అరెనాలో ఉపయోగించారు. ఈ పదార్థాన్ని ఆవిష్కరించినందుకు గానూ 2016లో సింఘువా కిహాంగ్ స్కాలర్‌షిప్ గోల్డ్ అవార్డును గ్యూయు గెలుచుకున్నాడు.


అదే సిలికాన్ అయాన్ పదార్థాన్ని సిమెంట్‌తో కలిపి రింగ్ తయారు చేసి తన ప్రయురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించడంతో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఆమె గ్యూయు భార్య కూడా. వందేళ్లైనా ఈ ఉంగరం చెక్కు చెదరదని, ఎన్నటికీ నిలిచి ఉండే తమ ప్రేమ బంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని గ్యూయు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆఖరికి రిక్షాను కూడా వదల్లేదు.. రిక్షాలో వెళుతూ వధువు డ్యాన్స్.. రిక్షా పుల్లర్ పరిస్థితి ఏంటంటే..


Viral: వామ్మో.. తనను కరిచిన పామును తిరిగి కరిచాడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2024 | 01:14 PM

Advertising
Advertising
<