ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Circus Stunt: సర్కస్‌లో షాకింగ్ ఘటన.. స్టంట్ చేస్తుండగా 12 అడుగుల ఎత్తు నుంచి..

ABN, Publish Date - Mar 18 , 2024 | 09:55 PM

సర్కస్‌లలో (Circus) ఎలాంటి భయంకరమైన స్టంట్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. గాల్లో ఎగురుతూ, రింగులతో చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే.. అవి చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తాయి, అంతే డేంజరస్ కూడా! ఏదైనా చిన్న పొరపాటు జరిగి జారిపడినా.. స్టంట్స్ చేసేవారికి తీవ్ర గాయాలవుతాయి.

సర్కస్‌లలో (Circus) ఎలాంటి భయంకరమైన స్టంట్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. గాల్లో ఎగురుతూ, రింగులతో చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే.. అవి చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తాయి, అంతే డేంజరస్ కూడా! ఏదైనా చిన్న పొరపాటు జరిగి జారిపడినా.. స్టంట్స్ చేసేవారికి తీవ్ర గాయాలవుతాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక మహిళ ట్రాపెజ్ రింగ్‌తో ఓ డేంజరస్ స్టంట్ చేస్తుండగా.. అనుకోకుండా జారిపడింది. దీంతో.. అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా హతాశులయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


రష్యాలోని నోవోసిబిర్స్క్‌లో ఒక సర్కస్‌ను నిర్వహించారు. ఈ సర్కస్‌ను వీక్షించేందుకు పెద్దఎత్తున జనాలు తరలివచ్చారు. సర్కస్ అక్రోబాట్స్ మొదటి నుంచి అద్భుత స్టంట్స్‌తో చూపరుల్ని ఆకట్టుకున్నారు. అయితే.. ట్రాపెజ్ రింగ్‌పై ఎలిజవెటా చుమకోవా (24) అనే మహిళ తలక్రిందులుగా వేలాడి ఓ డేంజరస్ స్టంట్ చేస్తున్నప్పుడు, అదుపు తప్పి కింద పడింది. ఆమె కిందపడకుండా ఉండేందుకు ప్రయత్నించింది కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఈ ఘటనతో ఆ సర్కస్‌లోని జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటనలో ఆ మహిళకు పెద్దగా గాయాలు అవ్వలేదని ఆ తర్వాత తెలిసింది.

ఎలిజవెటా కిందపడిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని, ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్స్ ప్రకారం.. హిప్, పాదాల వద్ద పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. అయితే.. ఆ గాయాలు ప్రాణాంతకమైనవి కావని తేలింది. సర్కస్ ప్రతినిధి గియా ఎరాడ్జే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోందని, ఆమె తమతో టచ్‌లో ఉందని అన్నారు. ఎలిజవెటా ఆరోగ్యంగానే ఉందని స్పష్టం చేశారు. గత పదేళ్ల నుంచి ఆమె సర్కస్‌లో పని చేస్తోందని, కానీ ఇలా పడటం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. 12 అడుగుల ఎత్తు నుంచే పడటంతో తనకు పెద్ద గాయాలేమీ అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Mar 18 , 2024 | 09:55 PM

Advertising
Advertising