Coconut: ఎక్కువ నీళ్ళున్న కొబ్బరి బొండం ఎంచుకోవడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..!
ABN, Publish Date - Mar 30 , 2024 | 02:59 PM
కొన్నిసార్లు కొబ్బరి బొండంలో ఆశించినంత నీరు ఉండకపోవచ్చు. దీనివల్ల డిజప్పాయింట్ అవుతాం. అలా కాకుండా కొన్న ప్రతి సారీ మంచి మొత్తంలో కొబ్బరినీరు లభించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.
వేసవికాలంలో పండ్లరసాలకు, కొబ్బరినీళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది శీతల పానీయాలతో పోలిస్తే తాజా పండ్ల రసాలు, కొబ్బరి బొండం మొదలైనవాటికే ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరి బొండం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా చాలామంచిది కాబట్టి వేసవిలో వీటి ధర పెరుగుతుంది. ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి అయినా కొబ్బరి బొండం కొనుగోలు చేస్తాం. కానీ కొన్నిసార్లు కొబ్బరి బొండంలో ఆశించినంత నీరు ఉండకపోవచ్చు. దీనివల్ల డిజప్పాయింట్ అవుతాం. అలా కాకుండా కొన్న ప్రతి సారీ మంచి మొత్తంలో కొబ్బరినీరు ఉన్న ఎంచుకోవాలంటే ఈ కింది సింపుల్ టిప్స్ పాటిస్తే సరి..
బాగా షేక్ చేయాలి..
సాధారణంగా దేవుడి పూజకు కొబ్బరికాయ కొనేముందు కొబ్బరికాయను బాగా షేక్ చేసి దానిలోపల నీటి శబ్దం వింటుంటాం. కొబ్బరి బొండాంని కూడా అలాగే షేక్ చేయాలి. లోపల నీటి శబ్దం బాగా ఎక్కువ వినబడితే ఆ కొబ్బరి బొండాంలో నీరు తక్కువ ఉన్నట్టు. అదే నీటి శబ్దం తక్కువ ఉంటే లోపల నీటి శాతం ఎక్కవ ఉంటుంది.
ఇది కూడా చదవండి: వేసవికాలంలో పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
పరిమాణం..
కొబ్బరి బొండాం పరిమాణాన్ని బట్టి అందువో నీరు కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి. పెద్ద పరిమాణంలో ఉన్న లేత కొబ్బరికాయలో నీరు ఎక్కువగా ఉంటాయి.
రంగు..
కొబ్బరి బొండాం ఎంపిక విషయంలో రంగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి బొండాం మీద ముదురు గోధుమ రంగు మచ్చలుంటే అందులో నీరు తక్కువ ఉంటాయి. అవి కొబ్బరి కాయలుగా రూపాంతరం చెందుతున్నాయని అర్థం. కానీ కొబ్బరి బొండాం మంచి ఆకుపచ్చ రంగులో ఆకర్షణగా ఉంటే అది తాజా కొబ్బరి బొండాం అని అర్థం. అందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎంపిక..
కొందరు కొబ్బరికాయలను లేత కొబ్బరితో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి కొబ్బరికాయల ఎంపికలో నీటిశాతం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ నీరు కాసింత తియ్యగా కూడా ఉంటాయి. మరికొందరు పూర్తీగా కొబ్బరి నీళ్లు ఉండాలని అనుకుంటారు. ఇష్టాన్ని బట్టి పైన చెప్పిన టిప్స్ తో కొబ్బరి బొండాన్ని ఎంచుకోవచ్చు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 02:59 PM