కొబ్బరిపాల ఉప్మా
ABN, Publish Date - Nov 17 , 2024 | 09:46 AM
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - ఒక కప్పు, కొబ్బరి పాలు - 3 కప్పులు, పల్లీలు, జీడిపప్పు (కలిపి) - గుప్పెడు, నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - ఒక టీ స్పూను, శనగపప్పు, మినప్పప్పు - 2 టీ స్పూన్లు చొప్పున, అల్లం, పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను చొప్పున, ఉల్లితరుగు - అరకప్పు, కరివేపాకు, కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - రుచికి సరిపడా.

తయారుచేసే విధానం: నూనెలో జీడిపప్పు, పల్లీలు దోరగా వేగించి పక్కనుంచాలి. అదే నూనెలో ఆవాలు, శనగపప్పు, మిన ప్పప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కరివేపాకు వేగించి, రవ్వ కూడా కలిపి దోరగా వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో కొబ్బరిపాలు పోసి, ఉప్పు వేయాలి.. పాలు మరుగుతున్నప్పుడు రవ్వ మిశ్రమం వేస్తూ అడగంటకుండా కలపాలి. పాలన్నీ ఇంకి ముద్దగా అయ్యాక కొత్తిమీర, జీడిపప్పు, పల్లీలు వేసి దించేయాలి. కొబ్బరిపాల ఉప్మా రుచితో పాటు శక్తిని కూడా ఇస్తుంది.
Updated Date - Nov 17 , 2024 | 09:46 AM