ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: చూసేందుకు ఇసుకలో పిల్లల ఆటల్లా ఉన్నా.. చూస్తుండగానే వేడి వేడి కాఫీ ఎలా చేశాడో చూడండి..

ABN, Publish Date - Jan 20 , 2024 | 09:12 PM

కాఫీ, టీలు తాగే వారు నిత్యం వివిధ రకాల ప్లేవర్లను ట్రై చేస్తుంటారు. లెమన్ టీని, జింజర్ టీ, బాదం టీ, మట్కా చాయ్.. ఇలా అనేక రకాల టీలు తాగుతుంటారు. కాఫీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా..

కాఫీ, టీలు తాగే వారు నిత్యం వివిధ రకాల ప్లేవర్లను ట్రై చేస్తుంటారు. లెమన్ టీని, జింజర్ టీ, బాదం టీ, మట్కా చాయ్.. ఇలా అనేక రకాల టీలు తాగుతుంటారు. కాఫీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా తయారీదారులు కూడా వివిధ రకాల రెసిఫీలతో కాఫీలు, టీలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి కాఫీ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇసుకలో కాఫీ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇసుకలో గ్లాసు ఉంచి చిన్న పిల్లల తరహాలో ఆడుకున్నట్లు కనిపిస్తాడు. కానీ చివరకు ఎలాంటి నిప్పు లేకుండా పొగలు కక్కే కాఫీని తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓ పెద్ద ఇనుప కంటైనర్‌లో ఇసుకను నింపేస్తాడు. తర్వాత ఓ గ్లాసులో పాలు, కాఫీ పొడి, చక్కెరను మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ గ్లాసును ఇసుకలో (sand) ఉంచి అటూ, ఇటూ తిప్పుతూ ఉంటాడు. చూసేందుకు ఇది పిల్లల ఆటలా అనిపిస్తుంది. కానీ ఎలాంటి నిప్పు లేకుండా కొద్ది సేపటికే గ్లాసులోని కాఫీ వేడి (hot Coffee) అవుతుంది. అలా ఇసుకలో తిప్పుతూ ఉండగానే వేడి అయిన కాఫీ కాస్తా.. పొగలు కక్కుకుంటూ పొంగుతుంది.

Viral Video: పరోటాతో సరికొత్త ప్రయోగం.. నెయ్యిలో వేయించి మరీ అందులో..

అలా పొంగుతున్న వేడి వేడి కాఫీని ప్లాస్టిక్ గ్లాసులో పోసి, కస్టమర్లకు అందిస్తాడు. కట్టెలు, గ్యాస్ ఇలా ఎలాంటి మంట లేకుండా.. కేవలం ఇసుక సాయంతో వేడి చేసిన కాఫీ రుచి బాగుండడంతో తాగేందుకు ఎగబడుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎడారి ప్రదేశాల్లో ఈ కాఫీ ఎంతో ఫేమస్’’.. అంటూ కొందరు, ‘‘ఇసుకతో కాఫీ తయారీ.. చూసేందుకు చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది టర్కిష్ కాఫీ కాదు.. అరబిక్ కాఫీ’’ అంటూ ఇంకొందరు, అలాగే చాలా మంది వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! రైలు సమీపానికి రాగానే.. వృద్ధురాలు ఎంత పని చేసింది.. వీడియో చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే..

Updated Date - Jan 20 , 2024 | 09:12 PM

Advertising
Advertising