Coffee Vs Hair: తాగడానికే కాదండోయ్.. కాఫీని ఇలా జుట్టుకు వాడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
ABN, Publish Date - May 14 , 2024 | 04:58 PM
కాఫీని కేవలం తాగడానికే కాదు సౌందర్య ఉత్పత్తులలోనూ వాడుతున్నారు. కొందరు కాఫీ పేస్ మాస్క్, కాఫీ స్క్రబ్ కూడా వాడుతుంటారు. అయితే ఇవన్నీ కాదు.. కాఫీని జుట్టుకు కూడా వాడటం ఇప్పుడు ట్రెండ్. కాఫీని జుట్టుకు వాడటం వల్ల షాకింగ్ ఫలితాలుంటాయని ఫ్యాషన్, బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.
కాఫీ.. ఉదయాన్నే తాగితే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. ఇంట్లో ఒకవేళ ఆలస్యం అవుతుందంటే బయటకు వెళ్లి టీ కొట్టు దగ్గర తాగి మరీ సాటిసిపై అయ్యే వారు ఉంటారు. కాఫీ అంటే అంత ఇష్టం అందరికీ. అయితే కాఫీని కేవలం తాగడానికే కాదు సౌందర్య ఉత్పత్తులలోనూ వాడుతున్నారు. కొందరు కాఫీ పేస్ మాస్క్, కాఫీ స్క్రబ్ కూడా వాడుతుంటారు. అయితే ఇవన్నీ కాదు.. కాఫీని జుట్టుకు కూడా వాడటం ఇప్పుడు ట్రెండ్. కాఫీని జుట్టుకు వాడటం వల్ల షాకింగ్ ఫలితాలుంటాయని ఫ్యాషన్, బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. కాఫీని జుట్టుకు ఎలా అప్లై చేయాలి? దీనివల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుంటే..
కాఫీతో జుట్టును కడగవచ్చు. కాఫీతో జుట్టు కడుక్కోవడం వల్ల స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు మృదువుగా మారుతుంది. ఉడికించిన కాఫీ 2 నుండి 4 కప్పులు తీసుకోవాలి. అయితే ఈ కాఫీ వేడిగా ఉండకూడదు. ఈ కాఫీని జుట్టు మీద పోసి చేతులతో రుద్దుతూ జుట్టును కడగాలి. ఈ కాఫీ నీళ్లను జుట్టు మీద 3 నుంచి 4 నిమిషాలు అలాగే ఉంచాలి. దీని తరువాత తలని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బంగారు రంగులో మెరుస్తుంది.
ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!
కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు చివర్లు చీలిపోవడం నుండి జుట్టు డ్యామేజ్‌ని తగ్గించడం వరకు అన్నింటిపైనా మంచి ప్రభావం చూపుతుంది. ఒక చెంచా కాఫీ పౌడర్‌లో ఒక గుడ్డులోని పచ్చసొన కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచి, ఆ తరువాత జుట్టును కడగేయాలి. జుట్టు చాలా మృదువుగా మారుతుంది. దెబ్బతిన్న జుట్టు రిపేర్ చేయబడుతుంది.
కొబ్బరినూనె, కాఫీని తలకు రాసుకుంటే జుట్టు బాగా కండిషన్ అవుతుంది. కప్పులో నాలుగ వంతు కొబ్బరి నూనె, ఒక చెంచా కాఫీ తీసుకోవాలి. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కాఫీ పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని కొద్దిగా వెచ్చగా ఉన్నట్టే జుట్టు మీద అప్లై చేయాలి. వేడి తక్కువగా ఉందని గుర్తుంచుకున్న తర్వాతే దీన్ని వాడాలి. దీన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టు మెరుస్తుంది పార్లర్ లేదా హెయిర్ స్పా లో జుట్టు స్టైల్ చేసినట్లుగా కనిపిస్తుంది.
తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!
పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 14 , 2024 | 04:58 PM