Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..
ABN, Publish Date - Sep 03 , 2024 | 02:13 PM
క్రికెట్ మ్యాచ్ కామెంటరీ ఎక్కువగా ఇంగ్లీష్‌లో జరుగుతుంది. ఆ తర్వాత హిందీలో కూడా కామెంటరీ మొదలు పెట్టారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత స్థానిక భాషల్లో కూడా కామెంటరీ మొదలైంది. స్టార్ సంస్థ తమ స్పోర్ట్స్ ఛానెల్స్ ద్వారా స్థానిక భాషల్లో కూడా కామెంటరీ చేయిస్తున్నాయి.
క్రికెట్ మ్యాచ్ (Cricket Match) కామెంటరీ ఎక్కువగా ఇంగ్లీష్‌లో జరుగుతుంది. ఆ తర్వాత హిందీలో కూడా కామెంటరీ (Cricket Commentary) మొదలు పెట్టారు. ఐపీఎల్ (IPL) వచ్చిన తర్వాత స్థానిక భాషల్లో కూడా కామెంటరీ మొదలైంది. స్టార్ సంస్థ తమ స్పోర్ట్స్ ఛానెల్స్ ద్వారా స్థానిక భాషల్లో కూడా కామెంటరీ చేయిస్తున్నాయి. దీంతో తెలుగు, తమిళం, కన్నడం, భోజ్‌పురి వంటి భాషల్లో కూడా కామెంటరీ మొదలైంది. అయితే తాజాగా జరిగిన ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్‌కు చెప్పిన కామెంటరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ వ్యక్తి తన అద్భుత విన్యాసంతో అందర్నీ మంత్రముగ్ధులను చేశాడు (Viral Video).
sanskritsparrow అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను బెంగళూరులో చిత్రీకరించారు. ఓ చిన్న మైదానంలో గల్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అక్కడ ఓ యువకుడు నిల్చుని సంస్కృతంలో కామెంటరీ (Sanskrit Commentary) చేశాడు. ప్రొఫెషనల్ కామెంటేటర్‌లు ఇంగ్లీష్, హిందీలో ఎలా మాట్లాడతారో, ఆ యువకుడు కూడా అదే తరహాలో అద్భుతంగా కామెంటరీ చెప్పాడు. బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టగానే పెద్ద స్వరంతో గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో మాట్లాడాడు. అక్కడ ఉన్న వారందరూ మ్యాచ్ కంటే కూడా ఆ వ్యక్తి సంస్కృత కామెంటరీనే ఎక్కువగా ఆస్వాదించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.8 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అతడి ప్రతిభకు వందనం చేయాలి``, ``ఇప్పుడు దేవుడు కూడా క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించగలడు``, ``ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాలి``, ``సంస్కృతంలో ఇలా మాట్లాడేవాళ్లు చాలా అరుదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?
Viral Video: పెళ్లి వేడుకలో పానీ పూరీ.. పానీ వేసేందుకు వాడిన టెక్నిక్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 03 , 2024 | 02:13 PM