ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మళ్లీ పెళ్లి.. ఈ వయస్సులోనూ తాతపై బామ్మ కొంటెతనం.. నవ్వుకుంటున్న నెటిజన్లు!

ABN, Publish Date - Aug 13 , 2024 | 07:46 PM

అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచారు..! ఆ వివాహ పందిరిలో ఆ జంటను శతమానం భవతి అంటూ ఎవరు ఆశీర్వదించారో ఏమోగానీ.. పెళ్లి అయిన నాటి నుంచి నేటి వరకు ఆ దంపతులు కలిసి మెలిసి ఉన్నారు...

అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచారు..! ఆ వివాహ పందిరిలో ఆ జంటను శతమానం భవతి అంటూ ఎవరు ఆశీర్వదించారో ఏమోగానీ.. పెళ్లి అయిన నాటి నుంచి నేటి వరకు ఆ దంపతులు కలిసి మెలిసి ఉన్నారు. ఆ క్రమంలో సుఖదు:ఖాలనే కాదు.. కలిమి లేములను సైతం కలిసి పంచుకున్నారు..! ఇప్పుడు ఆ దంపతుల వయస్సు నూరు వసంతాలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ దంపతులకు మరోసారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. అదికూడా పిల్లలు (కొడుకులు), ఆ పిల్లల పిల్లలు (మునిమనవలు, మునిమనవరాళ్ల) సమక్షంలో ఈ దంపతులకు ఇలా వివాహం జరిగింది.


సిగ్గు మొగ్గలైంది..!

ఈ దంపతుల వివాహ వేడుక తమిళనాడులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాను చుట్టేస్తోంది. నూరేళ్ల వయస్సులో తాత.. బామ్మ మెడలో మళ్లీ మూడు మూళ్లతో.. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నీతోనే, నీ నీడలోనే అన్నట్లుగా తాళిబొట్టు కట్టారు. దీంతో ఆ వయస్సులో సైతం బామ్మ ముఖంలో సిగ్గు మొగ్గలైంది. అందుకు ఇదే నా సమాధానమంటూ పెనిమిటి బుగ్గను చాలా సుతిమెత్తగా ఇలా గిల్లి.. అలా వదిలారు. అంతేకాదు.. తాళ్లి బొట్టు మరోసారి ఆమె మెడలో పడగానే... దానిని ఆమె కళ్లకు అద్దుకున్నారు. బామ్మ బుగ్గ గిల్లడంపై నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. నేటి తరానికి ఈ వృద్ధ దంపతులు వివాహం ఆదర్శమని చెబుతున్నారు. భారతీయ స్త్రీలు తాళిబొట్టుకు ఇచ్చే విలువ ఎలా, ఎంతలా ఉంటుందనేందుకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 13 , 2024 | 09:16 PM

Advertising
Advertising
<