Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..
ABN, Publish Date - Sep 23 , 2024 | 04:51 PM
కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొనుగోలు చేసిన బ్రిటన్ దంపతులు దారుణ మోసానికి గురయ్యారు. ఇంటిని అమ్మిన వ్యక్తి ఆ భవనంలోని బాత్రూమ్‌లు, తలుపులు, కిటికీలు, వాటి అద్దాలు తీసుకెళ్లిపోవడంతో ఆ ఇల్లు పాడుబడినట్టుగా మారిపోయింది. అయితే, 9 ఏళ్ల న్యాయపోరాటం తరువాత ఆ దంపతులకు ఇటీవలే న్యాయం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ ఎస్టేట్.. మధ్యలో అందమైన పురాతన భవనం.. దానికి కొద్ది దూరంలో చిన్న చిన్న ఇళ్లు.. ఆ పరిసరాలంతా పచ్చదనంతో నిండిపోయిన వైనం.. ఇలాంటి భవనాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బ్రిటన్‌కు చెందిన ఓ జంట కూడా సరిగ్గా ఇదే చేసింది. తమ కలలకు ప్రతిరూపంగా ఉన్న ఎస్టేట్ ఏకంగా రూ.17 కోట్లు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ ఎస్టేట్ ఓనర్ ఎస్టేట్ తాళాలు ఇచ్చాక వెళ్లి చూస్తే దిమ్మతిరిగినంత పనైంది. పాత ఓనర్ చేసిన పనికి వారికి గుండె చెరువైపోయింది. ఆ తరువాత తొమ్మిదేళ్ల న్యాయపోరాటంతో వారికి ఇటీవల కాస్తంత ఊరట లభించింది. బ్రిటన్‌లో సంచలనం (Viral) కలిగిస్తున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!
మార్టిన్, సారా కాంటన్ దంపతులు 2014లో డా. మార్క్ పెయిన్ నుంచి ఈ ఎస్టేట్ కొనుగోలు చేశారు. ఆ భవనాన్ని హాలిడే రిసార్ట్‌గా, పెళ్లి వేదికగా మార్చాలని మార్టిన్, సారా దంపతులు భావించారు. మార్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక తాళం చెవులు తీసుకున్నారు. అయితే, మార్టిన్ దంపతులు ఇల్లు చూసేందుకు మరోసారి వస్తామంటే మార్క్ పదే పదే అడ్డుపడ్డాడు. దీంతో, వారికి ఎదో అనుమానం కలిగింది. చివరకు అతడు వెళ్లిపోయిన తరువాత వారు తమ కొత్త ఇంటికి వచ్చి అక్కడి దృశ్యానికి షాకైపోయారు. మార్క్ ఇల్లు ఖాళీ చేసే క్రమంలో అక్కడున్న అనేక వస్తువుల్ని తీసుకెళ్లిపోయాడు. బాత్రూమ్‌లు, మెట్లు, ఫ్లోరింగ్, పురాతన్ వుడ్ వర్క్, కిటికీలు, వాటికున్న అద్దాలు ఇలా అనేకం తీసుకెళ్లిపోయాడు. దీంతో, ఆ ఇల్లు పాడుపడ్డ కొంపలా మారిపోయింది. ఇది చూసి తాము మోసపోయామని గ్రహించిన వారు మార్క్‌ను నిలదీస్తే అతడు తన తప్పేమీ లేదని బుకాయించాడు.
Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?
దీంతో, ఆ దంపతులు స్థానిక కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. ఒప్పందం కుదుర్చుకోక ముందు మార్క్ తమకు చూపించిన బ్రోచర్‌ను ఆధారంగా సమర్పించారు. అందులో ఉన్న వస్తువులేవీ ప్రస్తుతం ఇంట్లో కనిపించట్లేదని అన్నారు. కిటికీ అద్దాలు, మెట్లు తీసుకెళ్లిపోయాడని, దీంతో, ఇల్లు తుఫానులో ధ్వంసమైనట్టుగా కనిపిస్తోందని వాపోయారు. ఇల్లును బాగు చేయించుకునేందుకు భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు.
Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!
దీంతో, పోలీసులు మార్క్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అతడే ఇంటిని ధ్వంసం చేశాడని రుజువు చేయలేక అతడిని విడిచిపెట్టారు. కానీ, మార్టిన్ దంపతులు చూపించిన ఆధారాలు బలంగా ఉండటంతో కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులకు సొంతదారు తామేనని రుజువు చేసిన వారికి వాటిని ఇచ్చేస్తామని పోలీసులు అన్నారు. కానీ, ఈ విచారణకు మార్క్ రాకపోవడంతో చివరకు మార్టిన్ దంపతులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా దాదాపు తొమ్మిదేళ్ల పోరాటం తరువాత ఇటీవలే వారికి స్వలంగా ఊరట కలిగింది. ఇలాంటి దారుణ మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తాను అస్సలు ఊహించలేదని మార్టిన్ స్థానిక మీడియా వద్ద వాపోయాడు.
Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్
Updated Date - Sep 23 , 2024 | 05:04 PM