ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇజ్రాయెల్‌ మీద ఇరాన్ మిస్సైల్స్ దాడి.. ఓ జంట ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో తెలిస్తే.. ఫొటో వైరల్..

ABN, Publish Date - Oct 09 , 2024 | 05:52 PM

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరు దేశాల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. అంతర్జాతీయంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు రేట్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇంత మందికి సమస్యలు సృష్టిస్తున్న ఈ యుద్ధం లెబనాన్‌కు చెందిన ఓ జంటకు మాత్రం మంచి చేసిందట.

Lebanese Couple Viral Photo

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం (Iran-Israel war) రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు రేట్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇంత మందికి సమస్యలు సృష్టిస్తున్న ఈ యుద్ధం లెబనాన్‌కు చెందిన ఓ జంటకు మాత్రం మంచి చేసిందట. ఆ జంట సోషల్ మీడియా ద్వారా ఇరాన్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Lebanese Couple Viral Photo).


ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఒకేసారి 180 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను (180 ballistic missiles) ప్రయోగించింది. అవి ఇరాన్ గగనతలం నుంచి ఇజ్రాయెల్‌ వైపు మెరుపు వేగంతో ప్రయాణించాయి. అదే సమయంలో లెబనాన్‌కు చెందిన ఓ జంట వివాహ వార్షికోత్సవం (wedding anniversary) జరుపుకుంటోంది. బహిరంగ ప్రదేశంలో ఆకాశం కింద తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటోంది. నల్లటి సూట్‌ వేసుకున్న అబ్బాయి తెల్లటి గౌనులో ఉన్న అమ్మాయిని కౌగిలించుకుంటున్నాడు. అదే సమయంలో ఆకాశంలో మిస్సైల్స్ ప్రయాణిస్తున్నాయి. అప్పుడు తీసిన ఫొటో అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన ఆ జంట ``మా వివాహ వార్షికోత్సవాన్ని అద్భుతంగా మార్చినందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు`` అని కామెంట్ చేసింది.


@Chaf97 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను 42 లక్షల మందికి పైగా వీక్షించారు. 91 వేల మందికి పైగా ఈ ఫొటోను లైక్ చేశారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నకిలీ ఫొటో``, ``మీరు మీ జీవితాంతం ఈ చిత్రాన్ని ప్రజలకు చూపుతూనే ఉంటారని నాకు తెలుసు``, ``ఇది నమ్మడానికి అనుకూలంగా లేదు``, ``ఇది ఫొటోషాప్ చేశారు``, ``వివాహ వార్షికోత్సవానికి అత్యుత్తమ ఫైర్ వర్క్స్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: 150 ఏళ్ల బతకాలనుకుంటున్న దంపతులు.. అందుకోసం వారు ఏమేం చేస్తున్నారో తెలిస్తే..


Viral Video: వామ్మో.. ఎంతలా కంగారు పెట్టిందో.. రోడ్డు పక్కన 9 అడుగుల కంగారూను చూసి షాక్.. వీడియో వైరల్..


Optical Illusion: ఆ అమ్మాయి బెడ్రూమ్‌లో ఓ కుందేలు దాక్కుంది.. 10 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 05:52 PM