Viral: వీరిది నిజంగానే జన్మజన్మల బంధం.. నమ్మశక్యం కాని లవ్ స్టోరీ!
ABN, Publish Date - May 04 , 2024 | 03:31 PM
జన్మజన్మల బంధానికి అసలైన ఉదాహరణగా నిలిచిందో బ్రిటన్ జంట. ఒకే ఆసుపత్రిలో పుట్టిన వారు పెద్దాయ్యాక జీవనసహచరులై చివరకు తల్లిదండ్రులయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: జన్మజన్మల బంధానికి అసలైన ఉదాహరణగా నిలిచిందో బ్రిటన్ జంట. ఒకే ఆసుపత్రిలో పుట్టిన వారు పెద్దాయ్యాక జీవనసహచరులై చివరకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ నగరానికి చెందిన రిచర్డ్‌సన్, బ్రాన్విన్ టేసీ..1994లో క్వీన్స్ మెడికల్ సెంటర్‌లో నెలలు నిండకుండానే జన్మించారు. జాక్ జన్మించిన కొద్ది వారాల వ్యవధిలో టేసీ జన్మించింది. ఇద్దరూ నెలలు నిండకుండా పుట్టడంతో పక్కపక్కనే ఉన్న రెండు ఇంక్యుబేటర్లలో ఉంచి వైద్యులు చికిత్స చేశారు. వారి బతకడం అసాధ్యమనుకుంటున్న తరుణంలో అద్బుతమే జరిగింది. ఒకరికోసం మరొకరు అన్నట్టు ఇద్దరు క్రమంగా కోలుకున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి.
Viral: పాల పొడిలో పొరపాటున మద్యం కలిపి ఇచ్చిన అమ్మమ్మ.. కోమాలోకి 4 నెలల చిన్నారి!
ఆ స్నేహం పిల్లలు ఇద్దరికీ కష్టకాలంలో ఆలంబనగా నిలిచింది. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచారు. టేసీకి 16 ఏళ్లు వచ్చే వరకూ హార్మోనల్ చికిత్స చేయించాల్సి వచ్చింది. టీనేజ్ వయసులో ఇద్దరూ వేర్వేరు స్కూళ్లకు మారిన వారి స్నేహం బంధం మాత్రం అలాగే కొనసాగింది. పుట్టినరోజులు, ఇతర వేడుకల సందర్భంగా వారు కలిసి మాట్లాడుకునే వారు (Couple who met as premature babies 30 years ago just had a baby girl).
2021లో టేసీ ఫేస్‌బుక్‌లో తన ఫొటో షేర్ చేయడం దాన్ని రిచర్డ్‌సన్ లైక్ చేయడంతో వారి బంధం మరో మలుపు తిరిగింది. మనసులు కలిసాయి. వారి బంధానికి చిహ్నంగా గతేడాది టేసీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాను పుట్టిన క్వీన్స్ మెడికల్ సెంటర్‌లోనే ఆమెకు ప్రసవం జరగడం కొసమెరుపు. బిడ్డ పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గుడ్ న్యూస్ మూమెంట్ అనే అకౌంట్‌లో వీరి ఉదంతం నెట్టింట కాలుపెట్టి వైరల్ అవుతోంది. తమ లాంటి జంట మరొకటి ఉండదేమో అని టేసీ మురిసిపోయింది.
Updated Date - May 04 , 2024 | 03:37 PM