Viral: విమానంలో రెచ్చిపోయిన లవర్స్.. 4 ఖాళీ సీట్లను మంచంలా వాడేసుకుంటూ.. పబ్లిక్‌గా..
ABN, Publish Date - Apr 11 , 2024 | 05:49 PM
విమానంలో ఓ జంట బహిరంగ ప్రేమ ప్రదర్శనలకు దిగిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో యువ జంటలు స్వేచ్ఛ పేరిట బహిరంగ ప్రదేశాల్లో హద్దులు దాటేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. పబ్లిక్‌గానే అధర చుంబనాలు, కౌగిలింతలతో రెచ్చిపోతూ వీడియోలు కూడా రికార్డు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నా నిత్యం ఏదోమూల ఈ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ బస్సులు, రైళ్లల్లో మాత్రమే కనిపించిన ఈ జాడ్యం తాజాగా విమానాలకూ పాకింది. విమానంలో పబ్లిక్‌గా ఓ జంట చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.
Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..
ఇటీవల ఓ విమానప్రయాణికుడు తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తను ప్రయాణిస్తున్న విమానంలో ఓ యువ జంట ఎలా హద్దులు దాటి రెచ్చిపోయిందీ చెప్పుకొచ్చాడు. నాలుగు ఖాళీ సీట్లు దొరకగానే వాటిపైకి జంట.. గాఢ పరిష్వంగాలు, చుంబనాలతో రెచ్చిపోయిందని చెప్పుకొచ్చాడు. ఏకంగా నాలుగు గంటల పాటు వారు తమదైన లోకంలో విహరిస్తూ చుట్టూ పరిసరాలనే మర్చిపోయారని అన్నాడు. వారి తీరు చూసి తొటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని అన్నాడు. కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు (Couples PDA On 4 hour Flight Leaves Internet in a Discomfort ).
Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో
కానీ, ఈ ఉదంతంపై జనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ‘‘ఇంత జరుగుతున్నా ఫ్లైట్‌లోని సిబ్బంది ఏమీ అనలేదంటి? ఏంటో తేడా కొడుతోంది బ్రో’’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ఇలాంటి జంటలతో ఇతరులకు ఇబ్బందని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఫొటోలోని మరో యువతి గురించి ప్రస్తావించారు. ఫ్లైట్‌లతో ఇంత రచ్చ జరుగుతున్నా పట్టించుకోకుండా ఆమె తనమానాన తాను గురక పెట్టి నిద్రపోవడం పలువురికి నచ్చింది. ఎవరైనా ఇలాగే బిందాస్‌గా బతికేయాలంటూ కామెంట్ చేశారు.
Viral: గుండెలో దిగబడ్డ ఇనుపరాడ్డు.. అరుదైన సర్జరీతో రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 11 , 2024 | 05:55 PM