ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cracked Heels: వేసవిలో కాలి పగుళ్లు ఎక్కువ అవుతున్నాయా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ క్రీమ్ తో మ్యాజిక్కే..!

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:40 PM

ఎక్కువసేపు నీటిలో, ఎండలో ఉండటం, తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల కాలి మడమల పగుళ్లు ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి మరింత పెరిగి ఒక్కోసారి కాలి మడమల నుండి రక్తస్రావానికి కారణమవుతాయి.

సాధారణంగా చాలామందికి కాలి మడమలు పగుళ్ల సమస్య ఉంటుంది. ఎక్కువసేపు నీటిలో, ఎండలో ఉండటం, తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల కాలి మడమల పగుళ్లు ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి మరింత పెరిగి ఒక్కోసారి కాలి మడమల నుండి రక్తస్రావానికి కారణమవుతాయి. విపరీతమైన మడమల నొప్పులు కూడా వీటి వల్ల వస్తాయి. కాలి మడమల నొప్పి, పగుళ్లు తగ్గించుకోవడానికి మార్కెట్లో బోలెడు క్రీములు ఉన్నాయి. కానీ అవేవీ అంత తొందరగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. కాలి మడమల పగుళ్లు తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీగా క్రీమ్ ఎలా తయారుచేసుకోవాలో.. దాని కోసం ఏం కావాలో.. పూర్తీగా తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

బియ్యం పిండి.. 2 స్పూన్లు

తేనె.. 1 స్పూన్

వైట్ వెనిగర్ .. 5నుండి6 చుక్కలు

అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!


తయారువిధానం..

పైన చెప్పుకున్న మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

ఉపయోగించే విధానం..

పైన తయారుచేసుకున్న క్రీమ్ ను పగిలిన పాదాల మడమలకు అప్లై చెయ్యాలి. 15నిమిషాల తరువాత కడిగేయాలి. దీన్ని వారానికి 3,4 సార్లు అప్లై చేస్తుంటే చాలా తొందరగా ఫలితం ఉంటుంది.దీని వల్ల చనిపోయిన చర్మం రిపేర్ అవుతుంది. కేవలం ఈ క్రీమ్ మాత్రమే కాదు.. మడమల పగుళ్లు తగ్గించుకోవడానికి మరిన్ని ఇంట్లోనే ఫాలో అయ్యే టిప్స్ ఉన్నాయి.

రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!


3 నుండి 4 స్పూన్ల తేనె తీసుకోవాలి. దీన్ని లైట్ గా వేడి చేయాలి. దీంట్లో 2 చెంచాల పాలు, నారింజ రసం కలపాలి. దీన్ని సుమారు 40 నిమిషాల పాటూ పగిలిన మడమలకు అప్లై చెయ్యాలి. ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

కలబంద కూడా కాలి మడమల పగుళ్లను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కలబంద గుజ్జుకు సమాన పరిమాణంలో గ్లిజరిన్ తీసుకోవాలి. దీన్ని పగిలిన మడమల మీద అప్లై చేయాలి. ఇది మడమలతు హైడ్రేషన్ ను ఇస్తుంది. పగుళ్ళు దూరం చేస్తుంది.

అరటిపండ్లు కూడా పగిలిన మడమలకు మ్యాజిక్ ట్రీట్మెంట్ చేస్తాయి. మడమల పగుళ్ల మీద అరటిపండు గుజ్జును రాసి అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. తేనెను స్క్రబ్ లాగా ఉపయోగించినా కాలి మడమల పగుళ్లు సులువుగా తగ్గుతాయి.

రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!

రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.య

Updated Date - Apr 16 , 2024 | 02:40 PM

Advertising
Advertising