Viral Video: అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది.. పిల్ల ఏనుగు వైపు వస్తున్నమొసలిని తల్లి ఏనుగు ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:21 PM
ఈ ప్రపంచంలో ఎవరికైనా అన్నింటి కంటే గొప్ప బంధం తల్లితోనే ఉంటుంది. పిల్లలకు తల్లి రక్షణ గోడలా నిలుస్తుంది. వారికేమైనా ఆపద వస్తే తన ప్రాణాలను ఒడ్డి పోరాడుతుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా తల్లి పాత్రే ఎంతో కీలకమైనది.
ఈ ప్రపంచంలో ఎవరికైనా అన్నింటి కంటే గొప్ప బంధం తల్లి (Mother)తోనే ఉంటుంది. పిల్లలకు తల్లి రక్షణ గోడలా నిలుస్తుంది. వారికేమైనా ఆపద వస్తే తన ప్రాణాలను ఒడ్డి పోరాడుతుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో (Animal) కూడా తల్లి పాత్రే ఎంతో కీలకమైనది. ఇతర జంతువుల నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు తల్లి ఎంతో శ్రమిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో తల్లి ఏనుగు (Mother Elephant) తన బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే తల్లి ప్రేమ అర్థమవుతుంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తల్లి ఏనుగు తన బిడ్డతో కలిసి అడవిలో ఉన్న ఓ నీటి కొలను దగ్గరకు వెళ్లింది. పిల్ల ఏనుగు (Baby Elephant) ఆ కొలనులో పడుక్కుంది. తల్లి ఏనుగు తన తొండంతో నీళ్లు తీసుకుని పైన వేసుకుంటుంది. ఇంతలో అక్కడకు మెల్లిగా ఓ మొసలి (Crocodile) వస్తోంది. ఆ మొసలి రాకను ముందుగా గమనించిన తల్లి ఏనుగు పరుగున వెళ్లి ఆ మొసలిపై దాడికి దిగింది. దానిని కాలితో తొక్కింది. తొండంతో నలిపేసింది. ఆ ఏనుగుతో పోరాడలేక మొసలి ఒడ్డు ఎక్కి వెళ్లిపోయింది (Elephant Videos).
అక్కడే కార్లో ఉన్న వ్యక్తులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తల్లిని మించిన రక్షణ ఎవరికీ ఉండదు``, ``ఈ ఏనుగు ఎంత వేగంగా వెళ్లిందో చూడండి``, ``పాపం.. బేబీ ఎలిఫెంట్ బాగా భయపడిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఎంత పెళ్లైతే మాత్రం మరీ ఇంత ఆనందమా? నడిరోడ్డు మీద వరుడి వింత డ్యాన్స్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2024 | 03:21 PM