Viral Video: సింహం, పులి మధ్య బాక్సింగ్ ఫైట్.. చివరకు ఏం జరిగిందో చూడండి..!
ABN, Publish Date - Apr 13 , 2024 | 07:16 PM
సింహం అడవికి రారాజు. సింహం ముందు ఏ జంతువూ నిలువలేదు. సింహంతో పోరాటానికి దిగిన ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. మరోవైపు పెద్ద పులి కూడా తక్కువదేం కాదు. పులి పంజా దెబ్బ ఎంతటి బలశాలికైనా చుక్కలు చూపిస్తుంది. అలాంటి సింహం, పులి తలపడితే ఎలా ఉంటుంది.
సింహం (Lion) అడవికి రారాజు. సింహం ముందు ఏ జంతువూ నిలువలేదు. సింహంతో పోరాటానికి దిగిన ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. మరోవైపు పెద్ద పులి (Tiger) కూడా తక్కువదేం కాదు. పులి పంజా దెబ్బ ఎంతటి బలశాలికైనా చుక్కలు చూపిస్తుంది. అలాంటి సింహం, పులి తలపడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బోనులో ఉన్న సింహం, పులి తలపడ్డాయి (Lion fight with Tiger). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
dj_rajput అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఒక బోనులో బంధించి ఉన్న సింహం, పులి పోరాటానికి దిగాయి. పెద్దగా గాండ్రిస్తూ ఫైటింగ్ చేసుకున్నాయి. సింహం వెనుక వైపునకు వెళ్లి పులి రెచ్చగొడితే.. సింహం ఎదురుదాడికి దిగింది. దీంతో పులి రెండు కాళ్లూ పైకెత్తి సింహం మొహంపై పిడిగుద్దులు కురిపించింది. అయినా సింహం వెరవకుండా పులిని ఎదురించింది. చివరకు ఇరు జంతువులూ పోరాటాన్ని విరమించాయి. ఆ ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియోలో పులిని చూస్తుంటే బాక్సర్ మేవేదర్ గుర్తుకువస్తున్నాడు``, ``సింహం కంటే పులి చాలా బలమైనది``, ``సింహం ధైర్యం ముందు పులి బలం సరిపోదు``, ``బలం వల్ల కాదు.. అనవసరంగా వేటాడకూడదనే తన నియమం వల్ల సింహం అడవికి రాజు అయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: మీ భర్త గే అంటూ మెసేజ్.. ఆ మహిళ దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడంతో షాక్.. అసలు కథేంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2024 | 07:16 PM