Viral Video: వామ్మో.. ఇది బాహుబలి ఫైట్‌కు ఏమాత్రం తీసిపోదు.. అడవిలో పులుల ఫైటింగ్ చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 17 , 2024 | 07:10 AM

సింహం, చిరుత వంటి క్రూర మృగాలు కూడా పెద్దపులితో తలపడడానికి ఆలోచిస్తాయి. అలాంటిది రెండు సమాన బలం కలిగిన పెద్ద పులులు తలపడితే ఎలా ఉంటుంది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఇది బాహుబలి ఫైట్‌కు ఏమాత్రం తీసిపోదు.. అడవిలో పులుల ఫైటింగ్ చూస్తే షాకవ్వాల్సిందే..
Tigers fighting in jungle

పెద్ద పులితో (Tiger) పోరు అంటే సాధారణ విషయం కాదు. పెద్ద పులి చాలా బలం కలిగి ఉంటుంది. సాధు జంతువులే కాదు.. సింహం, చిరుత వంటి క్రూర మృగాలు కూడా పెద్దపులితో తలపడడానికి ఆలోచిస్తాయి. అలాంటిది రెండు సమాన బలం కలిగిన పెద్ద పులులు తలపడితే ఎలా ఉంటుంది (Tigers fighting). చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంగిల్ సఫారీ (Jungle Safari) టూర్‌కు వెళ్లిన వారు ఆ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది (Viral Video).


ranthambhorepark అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు పెద్ద పులులు అడవిలో భీకరంగా పోరాడుతున్నాయి. ఒకదానినొకటి ఎత్తి కింద పడేసి ఫైట్ చేసుకుంటున్నాయి. రెండింటిలో ఏదీ వెనక్కి తగ్గడం లేదు. మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయిన తడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ టైగర్ రిజర్వ్ ఉంది. ఈ అడవిలో పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, గౌర్, నీల్‌గాయ్, స్మాల్ ఇండియన్ సివెట్, సాంబార్ జింక వంటి అనేక ఇతర జంతువులు ఆ అడవిలో ఉంటాయి.


కాగా, పెద్ద పులుల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``ఒక పులి ఆధీనంలో ఉన్న ప్రాంతంలోకి మరో పులి ప్రవేశించకూడదు``, ``ఓ మైగాడ్.. ఇది బాహుబలి ఫైట్``, ``ఈ ఫైట్‌ను లైవ్‌లో చూడడం నిజంగా ఓ గొప్ప అనుభూతి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..


Optical Illusion Test: మీది హెచ్‌డీ చూపు అయితే.. ``8``ల మధ్యనున్న ``3``ను 3 సెకెన్లలో పట్టుకోండి..

Viral Video: ఈమె ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. గాజులమ్మే మహిళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతోందో చూడండి..!


Viral: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. తన ఓనర్‌కు కోట్లు ఎలా సంపాదించి పెట్టిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2024 | 07:10 AM