ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘డాగ్‌ కార్ట్‌’లో దర్జాగా...

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:07 AM

చిన్నారిని స్కూలునుంచి ఇంటికి తీసుకురావటానికి సాధారణంగా తల్లి లేదా తండ్రి వెళ్తారు. కొందరు పిల్లలు స్కూల్‌ బస్సులోగానీ, ఆటోలోగానీ ఇంటికి చేరుతారు. అయితే చైనాలో కిండర్‌గార్టెన్‌ చదివే ఒక చిన్నారిని మాత్రం స్కూల్‌కు తీసుకొచ్చేది, తీసుకెళ్లేది ఒక కుక్క అంటే ఆశ్చర్యమేస్తుంది.

చిన్నారిని స్కూలునుంచి ఇంటికి తీసుకురావటానికి సాధారణంగా తల్లి లేదా తండ్రి వెళ్తారు. కొందరు పిల్లలు స్కూల్‌ బస్సులోగానీ, ఆటోలోగానీ ఇంటికి చేరుతారు. అయితే చైనాలో కిండర్‌గార్టెన్‌ చదివే ఒక చిన్నారిని మాత్రం స్కూల్‌కు తీసుకొచ్చేది, తీసుకెళ్లేది ఒక కుక్క అంటే ఆశ్చర్యమేస్తుంది. ఇటీవలే ఈ చైనా ‘డాగ్‌ కార్ట్‌’ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.


ప్రాంతం: ఉత్తర చైనాలోని హెబీ నగరం.

సమయం: సాయంత్రం నాలుగున్నర గంటలు.

స్కూల్‌ బెల్‌ మోగింది. పిల్లలంతా పొలోమంటూ గేటు బయటికి వచ్చారు. కొందరు పిల్లలు పేరెంట్స్‌ కోసం చూస్తున్నారు. కొందరు పిల్లలను పేరెంట్స్‌ బైక్స్‌ మీద తీసుకెళ్తున్నారు. మరికొందరు స్కూల్‌ బస్‌ ఎక్కుతున్నారు. అక్కడే ఒక లాబ్రడార్‌ డాగ్‌, చెక్క రిక్షాతో సిద్ధంగా ఉంది. చిన్నారి డయానా భుజాన బ్యాగ్‌తో పరుగెత్తుకొచ్చింది. ఆ శునకం ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చుంది. చిన్నారి వచ్చి చిట్టి రిక్షాలో కూర్చోగానే ఆ బండిని భుజానికెత్తుకుని పరుగెత్తిందా కుక్క. ఇది దానికి క్రమం తప్పని దినచర్య. చిన్నారి డయానాను ఉదయమే స్కూలు దగ్గర వదిలి పెట్టడం... స్కూలు పూర్తయ్యాక వెళ్లి ఇంటికి తీసుకురావటం ఈ శునకం పని.


యువరాణిలా...

డయానా ‘డాగ్‌ కార్ట్‌’ విషయానికొస్తే... అది ట్రాఫిక్‌లోనూ ఎంచక్కా దూసుకుపోతుంది. మనుషులూ, వాహనాలు అడ్డం వచ్చినా... తారు రోడ్డు మీద, మట్టిరోడ్డు మీద జాగ్రత్తగా తీసుకెళ్తుంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇబ్బంది రాలేదట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే... చైనాలో పిల్లలకు ఫిట్‌నెస్‌ శిక్షణ ఇస్తారు. అందుకే పిల్లలు గట్టిగా ఉంటారు. కిండర్‌గార్టెన్‌ చదివే ఐదేళ్ల డయానా ‘డాగ్‌ కార్ట్‌’ ఎక్కగానే పడిపోకుండా రెండు వైపులా చేతులతో బండిని గట్టిగా పట్టుకుంటుంది. కుక్క లాక్కెళ్తున్న ‘డాగ్‌ కార్ట్‌’ను కొత్తవాళ్లు వింతగా చూస్తుంటారు. ‘డయానా మాత్రం తనో యువరాణిలా మురిసిపోతుంద’ అంటారు ఆ చిన్నారి తల్లి.


శిక్షణతో నమ్మకం

వాస్తవానికి పిల్లలతో కుక్కలు స్నేహంగా ఉంటాయి. ఈ లాబ్రడార్‌ డాగ్‌ కూడా అంతే. దీని పేరు బార్టన్‌. వయసు రెండున్నరేళ్లు. డయానా తండ్రి పేరు డుయున్‌. ఈ డాగ్‌ కార్ట్‌ను తయారు చేసిందాయనే. కుక్క కాళ్లకు బండి తగలకుండా సరైన కొలతలు తీసుకున్నాడు. బండిని ఎత్తుకునేట్లు బార్టన్‌కు శిక్షణ ఇచ్చాడు. శిక్షణ తర్వాత మొదట్లో కొట్టు దగ్గరకు పంపించి... కిరాణాసామాను, కూరగాయలు, నీళ్ల బాటిళ్లు తెప్పించుకునేవాడు. బార్టన్‌ తనకు యజమాని అప్పగించిన పనిని చక్కగా చేసేది. దానిపై నమ్మకం ఏర్పడిన తర్వాత తన కూతుర్ని స్కూల్‌కు ‘డాగ్‌ కార్ట్‌’లో పంపించటం మొదలెట్టాడు. ‘ప్రారంభంలో డయానా


తండ్రి డాగ్‌ కార్ట్‌ వెంబడి వచ్చేవాడు. ఆ తర్వాత అది తన పనిని సవ్యంగా చేయడంతో మానేశారు’ అంటోంది స్కూల్‌ టీచర్‌. డయానా క్లాస్‌ టీచర్‌ ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ‘డాగ్‌ కార్ట్‌’ వీడియో

వైరల్‌ అయింది. ‘ఈ వాహనమే నా బిడ్డకు రోల్స్‌రాయిస్‌, బీఎమ్‌డబ్ల్యూ. నిజంగా ఆ కార్లలో కూర్చున్నా అంత హ్యాపీగా ఫీల్‌ కాదేమో’ అంటోంది తల్లి మురిసిపోతూ. కొసమెరుపు ఏమిటంటే సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసి ‘అలాంటి బండి మాకూ కావాలి... అలాంటి కుక్క మాకూ కావాలి’ అంటూ చాలా దేశాల్లో బుడతలు మారాం చేస్తున్నారట.

Updated Date - Oct 20 , 2024 | 10:07 AM