ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Daughters Choice: కూతుళ్లు ఈ 4 విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ కానవసరం లేదు..!

ABN, Publish Date - May 10 , 2024 | 04:52 PM

పిల్లలకు తల్లే మొదటి గురువు అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తల్లే చెబుతూ ఉంటుంది. అయితే కాలం మారుతోంది. కాలానికి తగినట్టు ఉంటూనే సంప్రదాయంగా, చక్కగా, ఎలాంటి అసభ్యత లేకుండా ఉండవచ్చు. కానీ కొందరు అమ్మలు మాత్రం కూతుళ్ల విషయంలో తమ అభిప్రాయాలు రుద్దుతూ ఉంటారు. చాలా విషయాలలో కూతుళ్లు తాము చెప్పినట్టు ఉంటేనే వాళ్లు కరెక్ట్ గా ఉంటున్నట్టు అని అంటుంటారు.

పిల్లలకు తల్లే మొదటి గురువు అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తల్లే చెబుతూ ఉంటుంది. అయితే కాలం మారుతోంది. కాలానికి తగినట్టు ఉంటూనే సంప్రదాయంగా, చక్కగా, ఎలాంటి అసభ్యత లేకుండా ఉండవచ్చు. కానీ కొందరు అమ్మలు మాత్రం కూతుళ్ల విషయంలో తమ అభిప్రాయాలు రుద్దుతూ ఉంటారు. చాలా విషయాలలో కూతుళ్లు తాము చెప్పినట్టు ఉంటేనే వాళ్లు కరెక్ట్ గా ఉంటున్నట్టు అని అంటుంటారు. అయితే అమ్మాయిలు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కానవసరం లేదు. తల్లులు చెప్పినా చెప్పకపోయినా కింది 4 విషయాలలో కూతుళ్లు తమ అభిరుచి మేరకు ఉండవచ్చు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

బ్యూటీ కాంప్లెక్స్..

అమ్మల కాలం వేరు.. ఇప్పటి కాలం వేరు. అమ్మల కాలానికి తగినట్టు రెఢీ అవ్వడం తప్పు కాదు. కానీ ట్రెండ్ కు తగ్గట్టు అమ్మాయిలు పద్దతిగా ఉంటూనే ఫ్యాషన్ గా కూడా రెఢీ అవ్వచ్చు. ఇప్పటి ఫ్యాషన్ చాలా విస్తృతమైనది. చర్మం రంగు, శరీరాకృతి, జుట్టు టైప్ మొదలైనవాటిని బట్టి అందంగా తయారవడం గురించి ఎంపికలు చేసుకోవచ్చు.

గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!


శరీరాకృతి..

అమ్మాయిలు అంటే అందంగా, నాజూగ్గా ఉండాలి. ఇదొక ట్యాగ్ అమ్మాయిలకు అన్యయిస్తుంటారు. ఎవరి వరకో ఎందుకు.. ఇంట్లో తల్లులే కూతుళ్లను లావు అవుతున్నావని, శరీరం తగ్గించమని రకరకాలుగా అంటుంటారు. అయితే కొందరు ఎక్కువ తినకపోయినా, ఎలాంటి అనారోగ్యకరమ ఆహారపు అలవాట్లు లేకపోయినా లావుంటారు. ఇది జీన్స్ ప్రభావం. కానీ అమ్మాయిలు మాత్రం తమ శరీరం నాజూగ్గా ఉండాలనే ఆలోచనతో తమ శరీరాన్ని తాము హింసించుకుంటారు. ఆరోగ్యంగా తింటూ, ఆరోగ్యమైన జీవనశైలి ఫాలో అయితే లావుగా ఉన్నా ఏమీ కాదు..

పోలిక..

ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకం. అమ్మాయిలు కూడా ఇంతే.. సన్నగా నాజూగ్గా, స్టైల్ గా ఉన్న అమ్మాయిలతో పోలిక పెట్టుకుని తమను తాము తక్కువ చేసుకోకూడదు. తల్లులు ఇతర అమ్మాయిలతో తమ కూతుళ్లను పోలిక పెట్టినా వాటిని అమ్మాయిలు పరిగణలోకి తీసుకోకూడదు.

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!


ప్రాధాన్యత..

ప్రతి ఇంట్లో తల్లికి తన భర్త, పిల్లలు, అత్తమామలు, బంధువులు లోకం. ఆమె తన గురించి తాను పట్టించుకోకుండా తన వారి కోసమే అన్నీ చేస్తుంది. వారి సంతోషంలోనే తనూ సంతోషం చూసుకుంటుంది. దీనికి తగ్గట్టే తమ కూతుళ్లు కూడా అలాగే ఉండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అయితే ఈ పని ఏ ఆడపిల్లా చేయకూడదు. ఒకరి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కోవడానికి మించిన మూర్ధత్వం మరొక్కటి ఉండదు. ప్రతి ఆడపిల్ల ముందు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. తమ ఆరోగ్యం నుండి ఇతర విషయాలు ఏవైనా సరే.. తనకు తాను సమయాన్ని కేటాయించుకుంటూ, తన సంరక్షణ తను చూసుకోవాలి.

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!

గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 10 , 2024 | 04:52 PM

Advertising
Advertising