ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి రిస్క్‌లు ఎందుకు భయ్యా.. నడిరోడ్డులో మిల్క్ భయ్యా స్టంట్‌లు చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 26 , 2024 | 04:26 PM

చాలా మంది అబ్బాయిలు రోడ్లపై బైక్‌లను వేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ పాల వ్యాపారి కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. బైక్‌పై ఇంటింటికీ పాలు తెచ్చే పాల వ్యాపారి తాజాగా ప్రమాదకర స్టంట్ చేశాడు

Dangerous bike stunt

ప్రస్తుత రీల్స్ (Reels) యుగంలో బైక్ స్టంట్లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. చాలా మంది అబ్బాయిలు రోడ్లపై బైక్‌లను వేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ (Bike Stunts) తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రస్తుతం ఓ పాల వ్యాపారి (Milk Man) కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. బైక్‌పై ఇంటింటికీ పాలు తెచ్చే పాల వ్యాపారి తాజాగా ప్రమాదకర స్టంట్ (Dangerous Stunt) చేశాడు. పాల క్యాన్‌లతో లోడ్ చేసిన బైక్‌లపై విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు (Viral Video).


animall.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మిల్క్‌మ్యాన్ స్పీడ్‌గా వెళ్తున్న తన బైక్‌పై నిలబడి ఉన్నాడు. ఆ బైక్ వెనుక అటూ ఇటూ భారీ పాల క్యాన్‌లు తగిలించి ఉన్నాయి. అతడి వెనుక ఇతర బైకర్లు ఉన్నారు. ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నప్పుడు, ఈ పాల వ్యాపారి ముఖంలో భయమే కనిపించడం లేదు. మిల్క్‌మ్యాన్ పాట వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిల్క్‌మ్యాన్ వైరల్ వీడియోపై ప్రజలు రకరకాల కామెంట్‌లను పోస్ట్ చేస్తున్నారు.


ఈ వైరల్ వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అన్నయ్యా, నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు, నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించు``, ``ఇలా ప్రవర్తించి మీరు మీ అహంకారాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారా?``, ``మీలాంటి వారి వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడి అమాయకులు బలి అవుతున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ తెలివి తేటలు చూస్తే షాకవ్వాల్సిందే.. బైక్ ఇంజిన్‌లతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..


Viral Video: ఒకవైపు ఆస్ట్రిచ్.. మరోవైపు మేక.. ఈ వెరైటీ బండిని చూసిన నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..


Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 26 , 2024 | 04:26 PM