ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నీటిలో మొసలి.. ఒడ్డుపై సింహం.. ఆ జింక తన ప్రాణాలు ఎలా కాపాడుకుందో చూడండి..

ABN, Publish Date - Mar 23 , 2024 | 09:47 PM

నీటిలో మొసలికి చిక్కినా, నేల మీద సింహానికి ఎదురుపడినా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎంతటి బలమైన జంతువులైనా ఈ ప్రమాదకర జంతువుల ముందు నిలువలేవు.

నీటిలో మొసలికి (Crocodile) చిక్కినా, నేల మీద సింహానికి (Lion) ఎదురుపడినా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎంతటి బలమైన జంతువులైనా ఈ ప్రమాదకర జంతువుల ముందు నిలువలేవు. జింక (Deer) వంటి సాధు జంతువులు వీటికి గనుక చిక్కితే ఇక బతకడం అనేది కుదరని పని. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. నీటిలో మొసలి నుంచి తప్పించుకున్న ఓ జింక.. ఒడ్డున ఉన్న సింహం కంట పడింది.

@shabdsar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జింక నీటిలోని మొసలికి చిక్కి ఎలాగోలా తప్పించుకుని ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒడ్డు మీద కాచుకుని కూర్చున్న సింహం.. ఆ జింకను పట్టుకునేందుకు పరిగెత్తింది. అయినా ఆ జింక తన పోరాటాన్ని ఆపలేదు. తన కొమ్ములతో సింహాన్ని భయపెట్టింది. తన మీదకు దూకకుండా ఆ సింహాన్ని జింక నిలువరించగలిగింది. జింక ధైర్యం చూసిన సింహం వెనుకడుగు వేసింది. వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.

Watch Video: కొందరు తండ్రులు అంతే.. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు..!

``పోరాడని వారు మాత్రమే ఓడిపోతాడు`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.2 లక్షల మంది వీక్షించారు. దాదాపు 4 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోలో జింకపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఈ వీడియో ఎంతో మందికి స్ఫూర్తి``, ``జింక పోరాటం రెండు క్రూర మృగాలను ఓడించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 23 , 2024 | 09:47 PM

Advertising
Advertising