ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం

ABN, Publish Date - Aug 08 , 2024 | 09:03 AM

ఆనారోగ్యంతో భర్త మరణించాడు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గడ్‌లో ఆ తల్లి నివసిస్తుంది. అయితే ఆగస్ట్ 3వ తేదీన.. తన ఇంట్లో చెవి దిద్దులు, బంగారపు ఉంగరంతోపాటు రెండు చైన్లు కనిపించకుండా పోయాయి. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 08: ఓ టీనేజర్.. తన గర్ల్‌ ఫ్రెండ్ బర్త్‌ డే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాడు. అలాగే ఆమెకు మంచి గిఫ్ట్ కొనిచ్చి ఖుషీ ఖుషీ చేయాలని భావించాడు. ఆ క్రమంలో ఇంట్లో అమ్మ నగలను చోరీ చేశాడు. ఈ విషయం తెలియక తన ఇంట్లో చోరీ జరిగిందంటూ ఆ కన్న తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ‘పనితనం’ తన కన్న కొడుకుదేనని తెలుసుకొని ఆ తల్లి నిర్ఘాంత పోయింది.


ఈ ఘటన ఆగస్ట్ 3వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనారోగ్యంతో భర్త మరణించాడు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గడ్‌లో ఆ తల్లి నివసిస్తుంది. అయితే ఆగస్ట్ 3వ తేదీన.. తన ఇంట్లో చెవి దిద్దులు, బంగారపు ఉంగరంతోపాటు రెండు చైన్లు కనిపించకుండా పోయాయి. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు ఉదయం 8. 00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల మధ్య ఈ చోరీ జరిగిందని ఆమె.. తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ క్రమంలో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఆ ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులు ఎవరు కనిపించిన దాఖలాలు అయితే సీసీ కెమెరాల్లో ఎక్కడా నమోదు కాలేదు.


దీంతో కుటుంబంలోని వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు. అయితే ఈ చోరీ జరిగిన నాటి నుంచి ఆమె కుమారుడు ఇంటి రావడం లేదన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సదరు టీనేజర్ చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. అతడి స్నేహితుల నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించారు. వాటి ఆధారంగా ధరంపురా, నజాఫ్‌గడ్, కక్‌రోలా తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.50 వేలతో ఓ బాలుడు ఐ ఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తప్పించుకు తిరుగుతున్న సదరు టీనేజర్‌ను వలపన్నీ అతడి ఇంటి వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


తొలుత ఈ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. ఆ తర్వాత అసలు నిజం పోలీసులకు తెలిపారు. అతడి వద్ద ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన గోల్డ్ రింగ్, రెండు నెక్లస్‌లు ఇద్దరు స్వర్ణకారులను వేర్వేరుగా విక్రయించినట్లు తెలిపాడు. దీంతో వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి బంగారం నెక్లస్‌లతోపాటు గోల్డ్ రింగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.


చదువుపై పెద్దగా ఆసక్తి లేదని పోలీసుల విచారణలో టీనేజర్ వెల్లడించారు. గర్ల్‌ ఫ్రెండ్‌ను బాగా ఇంప్రెస్ చేయడం కోసం ఆమె బర్త్‌డే ఫంక్షన్ ఘనం నిర్వహించాలని నిర్ణయించాడు. దాంతో తనకు నగదు కావాలని కన్న తల్లిని కోరాడు. ముందు చదువుపై దృష్టిసారించాలని అతడికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని చెవి దిద్దులు, చేతి ఉంగరంతోపాటు చైన్లు తీసుకు వెళ్లి.. స్వర్ణకారులకు వేర్వేరుగా విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Aug 08 , 2024 | 09:03 AM

Advertising
Advertising
<