ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎబ్బే.. ఇంత గలీజ్ గాల్లేంట్రా బాబూ.. షూ లో థమ్సప్ పోసుకుని మరీ..

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:38 PM

ఢిల్లీ మెట్రో.. సకల కళా ప్రదర్శనలకు నిలయంగా మారుతోంది.. ఢిల్లీ మెట్రోలో ఇప్పటికే లవర్స్ ప్రదర్శించి నీలి చిత్రాలు చూడలేక జనాలు గగ్గోలు పెడుతుంటే.. ఇప్పుడు మరో రకం సిత్రాలు విసిగెత్తిస్తున్నాయి. తాజాగా ఓ జంట చేసిన గలీజ్‌ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Delhi Metro Video

న్యూఢిల్లీ, జనవరి 07: ఢిల్లీ మెట్రో.. సకల కళా ప్రదర్శనలకు నిలయంగా మారుతోంది.. ఢిల్లీ మెట్రోలో ఇప్పటికే లవర్స్ ప్రదర్శించి నీలి చిత్రాలు చూడలేక జనాలు గగ్గోలు పెడుతుంటే.. ఇప్పుడు మరో రకం సిత్రాలు విసిగెత్తిస్తున్నాయి. తాజాగా ఓ జంట చేసిన గలీజ్‌ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎబ్బే.. మరీ ఇంత గలీజ్ గాళ్లు ఉన్నారేంట్రా బాబూ అని అసహ్యించుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? వారు ఏం చేశారో పూర్తి వివరాల్లోకెళదాం.

ఢిల్లీ మెట్రోలో ఓ యువతి, యువకుడు ప్రయాణిస్తున్నారు. సీట్ దొరకగానే తాపీగా కూర్చునర్నారు. ఆ తరువాత తమ వెంట తెచ్చుకున్న ఒక పెద్ద థమ్సప్ బాటిల్‌ను ఓపెన్ చేశారు. అయితే, దానిని వారు గ్లాస్‌లో పోసుకుని తాగకుండా.. యువకుడు తన షూ విప్పి అందులో పోసుకుని.. స్ట్రా వేసుకుని తాగేశాడు. అతని తరువాత పక్కన కూర్చుకున్న యువతి కూడా అలాగే షూలో పోసిన థమ్సప్ తాగేసింది. దీనిని మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీనిని ప్రాంక్ అని అంటుంటే.. మరికొందరు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబూ అని విమర్శిస్తున్నారు. అసలు ఢిల్లీ మెట్రో అంటేనే భయమేస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 09:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising