Viral Video: ఆ ఫుడ్ తినండి.. బరువు తగ్గండి.. ఢిల్లీ రెస్టారెంట్ వినూత్న ప్రకటన.. నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN, Publish Date - May 28 , 2024 | 11:50 AM
ఛోలే భతురే.. ఉత్తరభారతదేశంలో ప్రముఖ వంటకం. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఢిల్లీ వాసులకు ఈ మసాలా వంటకం అంటే నోరూరుతుంది. అయితే ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే స్థాయిలో క్యాలరీలను కలిగి ఉంటుంది.
ఛోలే భతురే (Chole Bhature).. ఉత్తరభారతదేశంలో ప్రముఖ వంటకం. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఢిల్లీ వాసులకు ఈ మసాలా వంటకం అంటే నోరూరుతుంది. అయితే ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే స్థాయిలో క్యాలరీలను కలిగి ఉంటుంది. ఛోలే భతురే తింటే చాలా త్వరగా బరువు పెరుగుతారు అని అందరూ నమ్ముతారు. అయితే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ (Delhi restaurant) మాత్రం విచిత్రమైన ప్రకటన ఇచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral News).
ఢిల్లీలోని ``గోపాల్ జీ`` అనే ఒక రోడ్‌సైడ్ రెస్టారెంట్, చోలే భాతురే తినడం ద్వారా బరువు తగ్గవచ్చని (weight loss), ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపవచ్చని పేర్కొంటూ తమ రెస్టారెంట్ ఎదుట ఓ బోర్డ్ ఏర్పాటు చేసింది. ఆదిత్య వోరా అనే సోషల్ మీడియా వినియోగదారు దానిని ఫొటో తీసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ``ఢిల్లీలోనే ఇలాంటి వాటిని చూడవచ్చు.. ఛోలే భతురే తినండి.. బరువు తగ్గండి.. అనారోగ్యాలను దూరం చేసుకోండి`` అని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌ను దాదాపు 61 వేల మంది వీక్షించారు. ఈ ట్వీట్‌పై తమ స్పందనలను తెలియజేశారు. ``పై వాక్యాలలో దేనికీ కనెక్షన్ లేదు. ఛోలే భతురే తింటే బరువు తగ్గడం కుదరదు``, ``ఇది హాస్యాస్పదంగా ఉంది``, ``ఇది అద్భుతంగా ఉంది. కానీ అలా జరగదు``, ``ఇది మోసపూరిత ప్రకటన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ తెలివితేటలకు పరీక్ష.. ఈ బీచ్ ఫొటోలోని తప్పేంటో 5 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 28 , 2024 | 11:50 AM