ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఏం తెలివి అన్నా.. ఆటోలో పైప్ ఎందుకు బిగించాడో తెలిస్తే.. సలాం కొట్టకుండా ఉండలేరు!

ABN, Publish Date - Mar 23 , 2024 | 03:14 PM

పెద్ద పెద్ద చదువులు, ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం లేకుండానే చాలా మంది కార్మికులు, సామాన్యులు సృజనాత్మకంగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ఆటో డ్రైవర్ తెలివి చూసి షాకవ్వాల్సిందే.

కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే ఎంత పెద్ద సమస్యకైనా చాలా సులభమైన పరిష్కార మార్గం దొరికేస్తుంది. పెద్ద పెద్ద చదువులు, ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం లేకుండానే చాలా మంది కార్మికులు, సామాన్యులు సృజనాత్మకంగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Jugaad Video) ఓ ఆటో డ్రైవర్ (Auto driver) తెలివి చూసి షాకవ్వాల్సిందే. ప్రస్తుతం వేధిస్తున్న వేసవి (Summer) సమస్యకు ఆ ఆటో డ్రైవర్ తన తెలివితో చెక్ పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఎండల్లో తిరిగే ఆటో డ్రైవర్లు వేడితో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. వెనుక సీటులో కూర్చునే వారికి గాలి తగులుతుంది కానీ, ముందు కూర్చునే డ్రైవర్‌కు గాలి తగలదు. దాంతో తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ పెద్ద పైపును (Pipe) తన ఆటోకు అమర్చాడు. ఆ పైపు ముందు భాగాన్ని బయటకు పెట్టి, చివరి భాగాన్ని తను కూర్చునే సీట్‌కు ఎదురుగా అమర్చాడు. ఆటో కదులుతున్నప్పుడు ఆ పైప్ గుండా బయటి గాలి లోపలికి వస్తుందని అతడి ప్లాన్.

Shocking Video: పాపం.. కారు బానెట్ మీద కూర్చున్నాడు.. కళ్లెదురుగా సింహం.. తర్వాతేం జరిగిందో చూడండి..

ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``ఇది టేబుల్ ఫ్యాన్``, ``ఇది వర్షంలో కూడా పని చేస్తుంది``, ``మనుషుల బ్రెయిన్‌ను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చెయ్యలేదు``, ``చాలా ఖరీదైన రేస్ కార్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 23 , 2024 | 03:14 PM

Advertising
Advertising