ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: తెలివి ఉండాలే గానీ, పురుగును కూడా ఇలా వాడుకోవచ్చు.. ఓ యువకుడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 05 , 2024 | 06:49 PM

చాలా మంది తమ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటూ ఇతరులను ఆశ్చర్యపరస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Desi jugad video, Youth uses bug to get work done

చాలా మంది ఏ పని అయినా సులభంగా అయిపోవాలని కోరుకుంటారు. పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండా తెలివితేటలతో తమ పని పూర్తి చేసుకుంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. చాలా మంది తమ తెలివితేటలతో (Intelligence) క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటూ ఇతరులను ఆశ్చర్యపరస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ కుర్రాడి షూ (Shoe) ఏసీ అవుట్ డోర్ యూనిట్‌పై పడిపోయింది. మరొక షూ మాత్రం డాబా మీద ఉంది. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌పై పడిన షూను తీయడానికి ఆ కుర్రాడు అద్భుతమైన టెక్నిక్‌ను ఉపయోగించాడు. ఆ షూను తీయడానికి ఓ కొమ్ము పురుగును (Rhinoceros beetle) ఉపయోగించాడు. కొబ్బరి తోటల్లో ఎక్కువగా కనిపించే ఈ కొమ్ము పురుగులు దేన్నైనా చాలా గట్టిగా పట్టుకోగలవు. ఆ వీడియోలోని కుర్రాడు ఆ పురుగుకు తాడు కట్టి దానిని ఆ షూ మీదకు దించాడు. ఆ పురుగు ఆ బూటును తన కాళ్లతో గట్టిగా పట్టుకుంది.


ఆ కుర్రాడు ఆ తాడుని పైకి లాగినపుడు ఆ పురుగుతో పాటు షూ కూడా పైకి వచ్చేసింది. అలా ఆ కుర్రాడు చాలా సులభంగా తన పని పూర్తి చేసుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2.9 లక్షల మంది వీక్షించారు. దాదాపు మూడున్నర వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తెలివి తేటలు ఉంటే పురుగులను కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు``, ``ఇది నిజమైన దేశీ జుగాడ్``, ``ఇలాంటిది ఇంతకుముందెప్పుడూ చూడలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..


Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..


Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 06:49 PM