Viral: చైనా హోటల్‌లో భారతీయుడికి ఊహించని అనుభవం.. నెట్టింట వీడియో వైరల్!
ABN, Publish Date - May 23 , 2024 | 09:20 PM
చైనాలోని ఓ హోటల్‌లో కస్టమర్లకు రోబో ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. తనకు కెదురైన అసాధారణ అనుభవాన్ని రికార్డు చేసిన ఓ భారతీయుడు వీడియోను నెట్టింట పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతికత మనిషి జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా చేసింది. ఇప్పుడు కృత్రిమ మేధ కూడా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చే్స్తోంది. ఇక మనుషులు చేయాల్సిన అనేక పనులను రోబోలు సులువుగా చక్కబెట్టేస్తున్నాయి. చైనాలోని ఓ రెస్టారెంట్‌లో రోబో కస్టమర్లకు డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. తాజాగా చైనాలో పర్యటిస్తున్న ఓ భారతీయుడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, శ్రీధర్ మిశ్రా అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు చైనా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ లో దిగాడు. ఈ క్రమంలో తనకు ఓ రొబో తన గది వరకూ వచ్చి ఫుడ్ డెలివరీ చేసి వెళ్లడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో మొత్తాన్ని రికార్డు చేసిన నెట్టింట పోస్ట్ చేశాడు (Desis Cant Keep Calm As Robot Delivers Food In China).
CyberCrime: రెండు రోజుల్లో రూ. కోటి కోల్పోయిన మహిళా టెకీ.. ఆమె పొరపాటు ఏంటంటే..
ఆ చిన్న రోబో అతడికి కావాల్సిన వస్తువుల్ని ఇచ్చి తనంతట తానుగా లిఫ్ట్ వద్దకు వెళ్లింది. ఆ తరువాత లిఫ్ట్‌లో మరో చోటకు వెళ్లిపోయింది. ఇదంతా ఆ రోబో కృత్రిమే మేధ సాయంతో తనంతట తానుగా చేసేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. రోబోలు మరీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందాయా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనా భారత్ కంటే ఎన్నో రెట్లు ముందుందని కొందరు అన్నారు. అసలైన సృజనాత్మకత అంటే ఇదే అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరేమో రోబో పనితీరుపై అనేక ప్రశ్నలు వేశారు. లిఫ్ట్‌లో తను వెళ్లాల్సిన అంతస్తుకు సంబంధించిన బటన్‌ను రోబో ఎలా ఎంచుకుందని కొందరు ప్రశ్నించారు. ఈ వీడియో జనాలను విపరీతంగా ఆశ్చర్యపరుస్తుండటంతో ఏకంగా 35 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - May 23 , 2024 | 09:29 PM