ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: కొందరు తండ్రులు అంతే.. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు..!

ABN, Publish Date - Mar 23 , 2024 | 08:17 PM

ఓ తండ్రి తన పిల్లల కోసం ఏమైనా చేస్తాడు. వారిని సంరక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. వారి సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.

ఓ తండ్రి (Father) తన పిల్లల కోసం ఏమైనా చేస్తాడు. వారిని సంరక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. వారి సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే కన్నీళ్లు రాకమానవు. నడవలేక వీల్ ఛైర్‌కే పరిమితమైన ఓ తండ్రి తన కూతురి (Daughter) సంతోషం కోసం ఆమె స్కూల్ ఫంక్షన్‌లో డ్యాన్స్ వేశాడు. వీల్ ఛైర్‌లోనే కూర్చుని కూతురికి మద్దతుగా నిలిచాడు. ఈ ఎమోషనల్ వీడియో (Emotional Video) ఎందరికో కన్నీళ్లు తెప్పిస్తోంది.

@TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ స్కూల్ ఫంక్షన్ జరుగుతోంది. కొందరు తండ్రులు, వారి కూతుళ్లు కలిసి వేదిక మీద ప్రదర్శన ఇస్తున్నారు. అయితే అందులో ఓ వ్యక్తి వీల్ ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు. కానీ ఇతర తండ్రుల మాదిరిగానే, అతను తన కుమార్తెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు. కూతురిని భుజాల మీదకు ఎత్తుకుని చుట్టూ తిరిగాడు. తన కూతురి సంతోషం కోసం ఆ వ్యక్తి తన వైకల్యాన్ని కూడా పక్కన పెట్టి స్టేజ్ ఎక్కడం చాలా మందిని ఎమోషనల్ చేస్తోంది.

Mukesh Ambani: ముఖేష్ అంబానీతో పెళ్లి.. నీతా పెట్టిన ఒకే ఒక్క కండీషన్ ఏంటో తెలుసా?

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 3.7 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ``ఓ తండ్రి పిల్లల కోసం ఏమైనా చేయగలడు``, ``నాకు కన్నీళ్లు వస్తున్నాయి``, ``కూతురి సంతోషం కంటే అతడికి ఏదీ ముఖ్యం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 23 , 2024 | 08:17 PM

Advertising
Advertising