Viral: డౌటొస్తే.. డాక్టర్ మాట కూడా వినొద్దు! చావును తప్పించుకున్న రోగి సూచన!
ABN, Publish Date - Jun 16 , 2024 | 09:37 PM
క్యాన్సర్ కారణంగా చావు తప్పికన్ను లొట్టపోయిన ఓ వ్యక్తి రోగులు తమ ఆరోగ్యం గురించి ఎలా ఉండాలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్ కారణంగా చావు తప్పికన్ను లొట్టపోయిన ఓ వ్యక్తి రోగులు తమ ఆరోగ్యం గురించి ఎలా ఉండాలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా (Viral) మారింది. యూఎస్ఏకు చెందిన డెన్వర్ చాలా కాలంగా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. డాక్టర్ దగ్గర జనరల్ చెకప్ చేయించుకుంటే అంతా సవ్యంగా ఉన్నట్టు వచ్చింది. కానీ అతడి ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. అతడి టెస్టు రిపోర్టులు చూసి వైద్యుడు ఏమీ లేదని తేల్చేశారు. అతడి సమస్యలన్నీ అతడి భ్రమగా కొట్టిపారేశాడు.
కానీ డెన్వర్‌లో మాత్రం సందేహాలు తొలగిపోలేదు. ఎందరు జనరల్ ఫిజీషియన్లను, స్పెషలిస్టులను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. అతడి టెస్టులన్నీ నార్మల్‌గా ఉండటంతో అతడి సమస్యను పట్టించుకోలేదు. ఈ క్రమంలో డెన్వర్ నాలుకపై చిన్న కురుపు వచ్చింది. దీంతో, ఆందోళన చెందని డెన్వర్ బాయోప్సీ టెస్టు చేయించుకున్నాడు.
Viral: దేవుడా.. రైల్వే స్టేషన్‌లో ఊహించని సీన్! ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో!
ఈ క్రమంలో అతడికి కాన్సర్ ఉన్నట్టు తెలడంతో అతడు దిమ్మెరపోయాడు. చివరకు వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి నాలుకలో పావు వంతును తొలగించారు. గంతులోని లింఫ్ నోడ్స్‌కు కూడా తీసేశారు.
తన అనుభావాన్ని టిక్ టాక్ లో పంచుకున్న డెన్వర్.. అనారోగ్యం వచ్చిన సందర్భాల్లో అన్ని టెస్టులూ చేయాలని డాక్టర్లను నిర్మొహమాటంగా అడగాలని చెప్పారు. సాధారణంగా చేసే బ్లడ్ యూరిన్ టెస్టుల్లో అన్ని రోగాలు బయటపడవని చెప్పుకొచ్చాడు. ఎవరి శరీరంపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని, కాబట్టి ఎటువంటి మొహమాటాలకూ పోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నాడు.
Updated Date - Jun 16 , 2024 | 09:37 PM