Viral News: షాకింగ్.. విమానంలో కుప్పకూలిన మహిళ.. అప్పుడే స్మార్ట్‌వాచ్‌తో..
ABN, Publish Date - Jul 06 , 2024 | 09:25 PM
ప్రస్తుతకాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికత ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. కెరీర్‌కు మెరుగులు దిద్దడమే కాదు.. మనుషుల ప్రాణాలు కాపాడటంలోనూ కీలక పాత్ర..
ప్రస్తుతకాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికత (Technology) ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. కెరీర్‌కు మెరుగులు దిద్దడమే కాదు.. మనుషుల ప్రాణాలు కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని హెల్త్ యాప్స్.. ఎందరినో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసిన సంఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఓ స్మార్ట్‌వాచ్ సైతం ఓ మహిళను రక్షించడంలో సహాయపడింది. జులై 2వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం జులై 2న ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. ఇందులో ప్రయాణిస్తున్న 56 ఏళ్ల మహిళ ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. అప్పుడు ఆ విమానంలో ఉన్న డా. గిగి వీ. కురుత్తుకులం ఆమెకు చికిత్స అందించడం కోసం ముందుకొచ్చాడు. అయితే.. ఆయన వద్ద ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అప్పుడు ఆమె చేతిలో స్మార్ట్‌వాచ్ ఉండటాన్ని గమనించాడు. దీంతో.. ఆమెను పడుకోమని చెప్పాడు. స్మార్ట్‌వాచ్ సహకారంతో ఆమె గుండెచప్పుడు, ఆక్సిజన్ సంతృప్తతను పర్యవేక్షించాడు. అంతేకాదు.. ఆ వాచ్ సహాయంతో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్షను కూడా నిర్వహించాడు.
ఆ పరీక్షలు నిర్వహించాక.. ఆ మహిళలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని, రక్తపోటు పెరిగిందని డాక్టర్ గుర్తించాడు. అనంతరం.. ఆమె కోలుకోవడానికి ఎలాంటి ఇంజెక్షన్‌లు కావాలో, విమానంలోని మెడికల్ కిట్‌లో నుంచి తీసుకొని ఇచ్చాడు. దాంతో.. ఆమె వెంటనే కోలుకోగలిగింది. నిజానికి.. ఆ మహిళ అస్వస్థతకు గురైందన్న విషయం తెలిసి, సమీపంలోని విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాలని పైలట్ భావించాడు. కానీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ గిగీ భరోసా ఇవ్వడంతో, పైలట్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత.. వైద్యబృందం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.
వాస్తవానికి.. విమానాల్లో వైద్యుల గుర్తింపును ధృవీకరించకుండానే వారిని చికిత్స నిర్వహించేందుకు అనుమతించరు. ఆరోజు డా. గిగీ తన ఐడీ కార్డుని చూపించడంతో.. ఆ మహిళకు చికిత్స అందించగలిగాడు. మరోవైపు.. కేవలం స్టార్ట్‌వాచ్ సహకారంతోనే మహిళకు చికిత్స అందించడంతో డాక్టర్‌ను మెచ్చుకుంటున్నారు. డాక్టర్ పనిని మెచ్చి.. శాన్‌ఫ్రాన్సిస్‌కో విమానంలో దిగిన తర్వాత ఆయనతో పాటు పైలట్ కలిసి ఫోటో దిగారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 06 , 2024 | 09:25 PM