Viral: గుండెలో దిగబడ్డ ఇనుపరాడ్డు.. అరుదైన సర్జరీతో రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు!
ABN, Publish Date - Apr 09 , 2024 | 07:50 PM
గుండెలో ఇనుప రాడ్డు దిగబడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకంగా 22 కిలోమీటర్లు ఈ-రిక్షాలో ప్రయాణించి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యులు ప్రపంచంలోనే ఇదో అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుండెలో ఇనుప రాడ్డు దిగబడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకంగా 22 కిలోమీటర్లు ఈ-రిక్షాలో ప్రయాణించి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యులు ఆసియాలో ఇదే అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు. యూపీలో (Uttarpradesh) వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సుల్తాన్‌పూర్ జిల్లా దుర్గాపూర్ గ్రామానికి చెందిన మన్నేలాల్ (54) తన ఇంట్లో బాత్రూమ్ నిర్మిస్తుండగా మార్చి 27న పైకప్పు కూలి ఆయనపై పడింది. ఈ క్రమంలో ఇనుప రాడ్డు ఆయన వీపులోంచి దిగబడి గుండెలో ఓ వైపున గుచ్చుకుని మరోవైపు నుంచి చాతీ ద్వారా బయటకు పొడుచుకువచ్చింది. ఫలితంగా ఛాతిలో రెండువైపులా రంధ్రాలు పడ్డాయి. ఇంతటి తీవ్ర గాయమైనా మన్నేలాల్ కంగారు పడకుండా తన ఈ-రిక్షాలో 22 కిలోమీటర్ల దూరంలోని జిల్లా ఆసుపత్రికి వెళ్లి చేరారు (Doctors at lucknow hospital save 54 yo man after rod pierces heart).
Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..
ఆయనను పరిశీలించిన వైద్యులు తొలుత అది సాధారణ గాయమని భావించారు. ఇనుప రాడ్డు వీపులో దిగి ఛాతిలోంచి బయటకు వచ్చిందని భావించారు కానీ గుండెలో గుచ్చుకుపోయిందని అస్సలు ఊహించలేదు. ఆ తరువాత స్కానింగ్ చేసి చూస్తే విషయం అర్థమై షాకైపోయారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు పేషెంట్ గుండె కొట్టుకోవడాన్ని ఆపేసి రాడ్డును తొలగిస్తారు. ఇందుకు బైపాస్ మెషీన్ అవసరం. దీనికి రూ. 3 లక్షలు ఖర్చువుతుండగా పేషెంట్ కుటుంబసభ్యుల ఆర్థిక స్థోమత ఇందుకు సహకరించలేదు. దీనికి తోడు ఈ ఆపరేషన్‌కు చాలా సమయం కూడా పట్టే అవకాశం ఉండటంతో వైద్యులు పేషెంట్ గుండె కొట్టుకుంటుండగా ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. తొలుత గుండెలోని ఓ చాంబర్‌ను మూసి ఆ తరువాత రాడ్ బయటకు లాగి రెండో చాంబర్‌ను కుట్లేసి మూసేశారు.
Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో
ఆపరేషన్ తరువాత మూడు రోజుల పాటు వెంటిలేటర్, తొమ్మిది రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశాక బాధితుడు కోలుకున్నాడు. ఆపరేషన్ నాలుగో రోజునే అతడు తనని తాను గుర్తుపట్టడంతో తమకు భారం మొత్తం దిగిపోయినట్టైందని వైద్యులు తెలిపారు. ఇలాంటి సమయాల్లో గడ్డకట్టిన రక్తం ఇతర అవయవాలకు చేరి అనారోగ్యానికి దారి తీయడం లేదా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుందని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ఆసియాలో ఇదే సారని వైద్యులు తెలిపారు. జపాన్‌లో ఇలాంటి ఓ ఘటన జరిగినా అక్కడి వైద్యులు పేషెంట్ గుండె కొట్టుకోవడం ఆగిపోయేలా చేసి, బైపాస్ యంత్రం వినియోగించి శస్త్రచికిత్స పూర్తి చేశారన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 09 , 2024 | 08:03 PM