ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: జింక కోసం ప్రాణాలకు తెగించిన కుక్క.. నది అవతలి ఒడ్డుకు వెళ్లి చివరకు ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Jan 19 , 2024 | 05:38 PM

కొన్ని జంతువుల మధ్య సహజంగానే శత్రుత్వం ఉంటుంది. అలాంటి జంతువులు ఎదురుపడిన సందర్భంలో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోవడమో, లేదా ఇంకో జంతువుకు ఆహారం అవడమో జరుగుతుంటుంది. అయితే...

కొన్ని జంతువుల మధ్య సహజంగానే శత్రుత్వం ఉంటుంది. అలాంటి జంతువులు ఎదురుపడిన సందర్భంలో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోవడమో, లేదా ఇంకో జంతువుకు ఆహారం అవడమో జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. శత్రువులు కాస్త మిత్రులుగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, జింక కోసం ప్రాణాలకు తెగించిన కుక్క వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నది అవతలి ఒడ్డుకు వెళ్లిన కుక్క చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కాలువలో నీరు చాలా ఎక్కువ లోతులో ఉంటుంది. ఇదిలావుండగా, ఓ జింక పిల్ల (baby deer) నది దాటలేక అవతలి వైపు నిలబడి ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీన్ని గమనించిన ఓ కుక్క జింకను కాపాడేందుకు సిద్ధమవుతుంది. యజమాని ఇలా ఆదేశం ఇవ్వగానే.. అలా రంగంలోకి దిగుతుంది. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నది అవతలి ఒడ్డుకు వెళ్తుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న జింక పిల్ల వద్దకు వెళ్లి.. ‘‘భయపడకు నీకు అండగా నేనున్నా.. నిన్ను ఎలాగైనా కాపాడతా’’.. అన్నట్లుగా జింక పిల్లను నోట కరుచుకుంటుంది.

Viral Video: విమానంలో లగేజీ పెడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో చూడండి..

కాలువలోకి దిగి ఈత కొడుతూ ఇవతలి ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తాను మొత్తం మునిగిపోతున్నా కూడా.. జింక పిల్లను మాత్రం ఎంతో జాగ్రత్తగా నోట కరుచుకుని క్షేమంగా (dog saved baby deer) ఒడ్డుకు చేర్చి, తన యజమాని చేతిలో పెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఈ కుక్క నిజంగా చాలా గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్కను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

బచ్చలికూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..

Updated Date - Jan 19 , 2024 | 05:41 PM

Advertising
Advertising