Viral Video: చిప్స్ కొనుక్కుని డబ్బులు ఇవ్వకుండా ఎలా ఏడిపించాడో చూడండి.. డ్రైవర్ ఏం చేశాడంటే..
ABN, Publish Date - Nov 07 , 2024 | 02:19 PM
కొందరు వ్యక్తులు అమాయకులతోనూ, పేద వాళ్లతోనూ, చిన్న పిల్లలతోనూ సరదా పనులు చేస్తుంటారు. వారిని ఏడిపించేందుకు ఇష్టపడుతుంటారు. సమయం, సందర్భం లేకుండా వారితో ఆటలాడుకుంటారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు వచ్చి వారికి బుద్ధి చెబుతుంటారు.
కొందరు వ్యక్తులు అమాయకులతోనూ, పేద వాళ్లతోనూ, చిన్న పిల్లలతోనూ సరదా (Fun) పనులు చేస్తుంటారు. వారిని ఏడిపించేందుకు ఇష్టపడుతుంటారు. సమయం, సందర్భం లేకుండా వారితో ఆటలాడుకుంటారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు వచ్చి వారికి బుద్ధి చెబుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చిరు వ్యాపారిని (Vendor) చూసి జాలి వేయక మానదు. సమయానికి బసు డ్రైవర్ రావడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
@SanjuGoyel అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిరు వ్యాపారి బుట్టలో స్నాక్స్ ప్యాకెట్లు (Snacks) పెట్టుకుని బస్సు దగ్గరకు వెళ్లి అమ్ముకుంటున్నాడు. బస్సులో కూర్చున్న ఓ వ్యక్తి అతడి బుట్టలో ఉన్న స్నాక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాడు. అయితే డబ్బులు (Money) ఇవ్వకుండా ఈ చిరు వ్యాపారిని ఏడిపించాడు. డబ్బులు అతడికి అందకుండా ఆటలాడాడు. అదే సమయంలో బస్సు బయల్దేరింది. దీంతో తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ చిరు వ్యాపారి బస్సు వెనుక పరిగెత్తాడు. ఆ ఘటనను అద్దంలో నుంచి చూసిన డ్రైవర్ బస్సును ఆపి కిందకు దిగి వచ్చాడు. దీంతో ఆ వ్యక్తి డబ్బులను ఇచ్చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 15 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలోని వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ``పేదవాళ్లతోనూ, అమాయకులను ఏడిపించాలని చూడకండి``, ``పేదవాళ్లతోనే ఇలాంటి ఆటలాడతారు``, ``బస్సు డ్రైవర్‌కు హ్యాట్సాఫ్``, ``అందరికీ ఉండాల్సింది మానవత్వమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్.. పేరెంట్స్‌కు ఎలా దొరికిపోయిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 07 , 2024 | 02:19 PM