ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బాబోయ్.. సముద్రంలో వింత జీవి.. మునుపెన్నడూ ఇలాంటిది చూడలేదు..

ABN, Publish Date - Sep 26 , 2024 | 05:43 PM

Doomsday Fish: ఈ భూ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చినవి కొన్ని జీవులు మాత్రమే.. వెలుగులోకి రానివి మరెన్నో ఉన్నాయి. వీటి కోసమే కొందరు అన్వేషకులు నిత్యం అన్వేషిస్తుంటారు. అటవీ ప్రపంచంలో.. సముద్ర గర్భంలో కోటానుకోట్లు గుర్తించని, అరుదైన జీవాలు మనుగడ సాగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Doomsday Fish

Doomsday Fish: ఈ భూ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చినవి కొన్ని జీవులు మాత్రమే.. వెలుగులోకి రానివి మరెన్నో ఉన్నాయి. వీటి కోసమే కొందరు అన్వేషకులు నిత్యం అన్వేషిస్తుంటారు. అటవీ ప్రపంచంలో.. సముద్ర గర్భంలో కోటానుకోట్లు గుర్తించని, అరుదైన జీవాలు మనుగడ సాగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా సముద్ర తీరంలో అరుదైన జలచరం కనిపించింది. చాలా అరుదుగా కనిపించే ఈ జీవి.. ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో కనిపించింది. అదే ‘డూమ్స్‌డే ఫిష్’. ఈ చేపను అధికారికంగా ‘ఓర్ ఫిష్’ అని కూడా పిలుస్తారు. ఇది అంత ఈజీగా కనిపించదు.


టివి ఐలాండ్స్‌ అడ్వేంచర్స్‌కు చెందిన కర్టిస్ పీటర్సన్ ఈ ఓర్‌ఫిష్‌ను పట్టుకుని, ఆ ఫోటోను ఫిషింగ్ ఆస్ట్రేలియా టీవీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆస్ట్రేలియన్ మ్యూజియం ప్రకారం.. ఈ ఓర్‌ఫిష్ ఉష్ణమండల ప్రాంతాల్లో 200 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోతులో నివసిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ వింత జీవి తొమ్మిది మీటర్ల పొడవు వరకు పెరుగుతుందట. దీనిని ఉపరితలంపై నుంచి చూస్తే పాము మాదిరిగా కనిపిస్తుందట. ఇక దీని ముఖం కూడా విచిత్రంగా ఉంటుంది. గుర్రం ముఖాన్ని పోలి ఉంటుంది.


ఓర్‌ఫిష్ అరుదుగా కనిపించినప్పటికీ.. ఇలాంటి ఒక జీవి ఉందని మాత్రం ప్రపంచానికి తెలిసింది. ఇటీవల కాలిఫోర్నియా బీచ్‌లో ఈ ఓర్‌ఫిష్‌ని గుర్తించారు. శాన్‌డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ బృందం.. 1901 నుంచి ఇప్పటి వరకు 20 సార్లు మాత్రమే కనిపించిందని చెప్పారు. ఇటీవల దొరికిన ఓర్‌ఫిష్ కేవలం 12 అడుగుల పొడవు(3.7 మీటర్లు) మాత్రమే ఉందని తెలిపారు. అరుదైన ఈ జీవి కోసం ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతోంది. ఈ ఓర్ ఫిష్ చూడటానికి వెండి రిబ్బన్ మాదిరిగా ఉంటాయి.


డూమ్స్‌డే ఫిష్ అని ఎందుకంటారు..?

ఈ ఓర్‌ఫిష్‌ను ‘డూమ్స్‌డే ఫిష్’గా కూడా పిలుస్తారు. ఎందుకంటే.. ఇది చెడుకు సంకేతంగా పేర్కొంటున్నారు. ఈ చేపలు తీరానికి వచ్చిన ప్రతిసారి తమతో పాటు భూకంపాలు, ఇతర విపత్తులను తీసుకువస్తాయని పలువురు అంటున్నారు. ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకారం, జపనీస్ జానపద కథలు ఈ జీవులను విపత్తు దూతలుగా పరిగణిస్తాయి. అంతేకాదు.. కాలిఫోర్నియాలో దొరికిన సందర్భంలోనూ.. రెండు రోజుల తరువాత నగరంలో భూకంపం సంభవించింది. ఆగష్టు 10న శాన్‌డియాలో సమీపంలో ఓర్‌ఫిష్ కనిపించింది. ఆగస్టు 12న లాస్ ఏంజిల్స్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ కారణంగానే.. వీటికి డూమ్స్‌డే ఫిష్ అని పేరు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ, సైంటిస్టులు మాత్రం ఈ వాదనను కొట్టిపడేస్తున్నారు. అదంతా మూఢనమ్మకం అని చెబుతున్నారు.


Also Read:

అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

భార్యకు స్కూటర్ యాక్సిడెంట్! తనపై తానే పోలీసు కేసు

మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ..

For More Trending News and Telugu News..

Updated Date - Sep 26 , 2024 | 05:43 PM