ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఫుల్‌గా తాగేసి బెంచీ మీద పడుక్కున్నాడు.. అర్ధరాత్రి అతడి పరిస్థితి చూసి పోలీసులకు ఫోన్ చేస్తే..

ABN, Publish Date - Apr 10 , 2024 | 02:39 PM

మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు తమ మానసిక, శారీరక వ్యవస్థలపై పట్టు కోల్పోతారు. తాము ఏం చేస్తున్నామో గ్రహించే స్పృహ కోల్పోతుంటారు. ఆ క్రమంలో పలు ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అలాగే ఇబ్బంది పడ్డాడు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు (Drunken Man) తమ మానసిక, శారీరక వ్యవస్థలపై పట్టు కోల్పోతారు. తాము ఏం చేస్తున్నామో గ్రహించే స్పృహ కోల్పోతుంటారు. ఆ క్రమంలో పలు ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా కాన్పూర్‌కు (Kanpur) చెందిన ఓ వ్యక్తి అలాగే ఇబ్బంది పడ్డాడు. బాగా మద్యం సేవించి పార్క్‌లోని బెంచీపై (Park bench) నిద్రపోయాడు. అర్ధరాత్రి అతడికి ప్రమాదం సంభవించింది. చివరకు పోలీసులు వచ్చి అతడిని కాపాడాల్సి వచ్చింది (Viral News).


కాన్పూర్‌లో ఉన్న స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంలీలా పార్క్‌లో ఓ వ్యక్తి నిద్రపోయాడు. అప్పటికే అతడు బాగా మద్యం సేవించి ఉన్నాడు. మద్యం మత్తులో అతడు ఆ బెంచ్‌పై పడుక్కున్నాడు. నిద్రలో పక్కకి తిరిగినపుడు అతడి మెడ బెంచ్ పలకల మధ్య ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అతడు బయటపడలేకపోయాడు. నొప్పితో కేకలు వేయడం ప్రారంభించారు. స్థానికులు కూడా అతడిని బయటకు లాగలేకపోయారు.


చేసేది లేక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులకు స్థానికులు ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని శాంతింపజేశారు. చాలా జాగ్రత్తగా అతడి మెడను బెంచ్ పలకల మధ్య నుంచి తప్పించారు. అనంతరం అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Viral: షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావలెను.. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!


Hyderabad: ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్ ఉత్తమం.. యువతి చెప్పిన 5 కారణాలపై నెటిజన్ల స్పందన ఏంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 02:48 PM

Advertising
Advertising