Viral Video: వామ్మో.. దుబాయ్‌లో వేడి ఈ స్థాయిలో ఉందా? ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే..!
ABN, Publish Date - Jun 18 , 2024 | 03:55 PM
ఈ వేసవి భారత్‌లో మండిపోయింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. ఇక, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంది. మన దేశంలో పరిస్థితే ఇలా ఉంటే ఉష్ణ దేశమైన దుబాయ్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది.
ఈ వేసవి (Summer) భారత్‌లో మండిపోయింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి (Heat wave). ఇక, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంది. మన దేశంలో పరిస్థితే ఇలా ఉంటే ఉష్ణ దేశమైన దుబాయ్ (Dubai)లో పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Dubai Heat). @TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి పెనం తీసుకుని తన ఫ్లాట్ బయటకు వచ్చి ఎండలో దానిని ఉంచాడు. కొద్ది సేపటి తర్వాత పెనంలో నూనె వేశాడు. నూనె వేడెక్కిన తర్వాత గుడ్డు పగలగొట్టి ఆ పెనంలో వేశాడు. చాలా తక్కువ సమయంలోనే అది కాస్తా ఆమ్లెట్ (Omelette) అయిపోయింది. దానిని వెంటనే ప్లేట్‌లో వేసుకుని వెళ్లిపోయాడు. దుబాయ్‌లో వేడి తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో చెప్పే ఈ షాకింగ్ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. 79 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వామ్మో.. ఇది నిజమా?``, ``ఇది ఫేక్. పెనంను ముందుగానే వేడి చేసి తీసుకొచ్చారు``, ``ఎంత ఎండ కాసినా అలా తక్కువ సమయంలో వేడెక్కడం జరగదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 18 , 2024 | 03:55 PM