ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..

ABN, Publish Date - Nov 13 , 2024 | 09:50 AM

ఆ మహిళ నోయిడాలోని సెక్టార్ 51లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకుంది. ఆమె కడుపులో పెరిగిన కణుతులను డాక్టర్లు తొలగించారు. అయితే సర్జరీ సమయంలో డాక్టర్లు ఆమె కడుపులో 23 సె.మీ. పైప్ వదిలేసి కుట్టేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు కడుపు నొప్పి మొదలైంది.

X-ray

ఆమె గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం మాత్రం కనిపించలేదు. దీంతో చివరికి ఓ హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడి డాక్టర్లు (Doctors) ఆమెను పరీక్ష చేసి చూశారు. ఎక్స్‌రే తీయించారు. ఎక్స్‌రే (X-ray) చూసిన డాక్టర్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె కడుపులో 23 సె.మీ. పైప్ (Pipe in stomach) ఉంది. డాక్టర్లు వెంటనే ఆమెకు సర్జరీ (Surgery) చేసి పైప్‌ను బయటకు తీశారు. నోయిడాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Viral News).


కిరణ్ నేగి అనే మహిళ నోయిడాలోని సెక్టార్ 51లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకుంది. ఆమె కడుపులో పెరిగిన కణుతులను డాక్టర్లు తొలగించారు. అయితే సర్జరీ సమయంలో డాక్టర్లు ఆమె కడుపులో 23 సె.మీ. పైప్ వదిలేసి కుట్టేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. ఎన్ని మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో మరో డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంది. ఆమె సమస్య విన్న డాక్టర్ ఎక్స్‌రే తీయించారు. ఎక్స్‌రే చూసిన డాక్టర్‌కు దిమ్మ తిరిగిపోయింది. కడుపులో 23 సె.మీ. పైప్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు.


వెంటనే ఆపరేషన్ చేసి ఆమె కడుపులో నుంచి పైప్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యకరంగా ఉంది. కాగా, తన కడుపులో పైప్ వదిలేసి కుట్టేసిన డాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. కాగా, ఆ మహిళ ఆరోపణలను డాక్టర్లు ఖండించారు. ఆమె కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీది హెచ్‌డీ చూపు అయితే.. ``8``ల మధ్యనున్న ``3``ను 3 సెకెన్లలో పట్టుకోండి..

Viral Video: ఈమె ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. గాజులమ్మే మహిళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతోందో చూడండి..!


Viral: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. తన ఓనర్‌కు కోట్లు ఎలా సంపాదించి పెట్టిందంటే..


Viral Video: వామ్మో.. రీల్స్ పిచ్చి ఇలా ఉంటుందా? వీడియో కోసం చీర కాల్చుకుంది.. చివరకు ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2024 | 09:51 AM