ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guinness World Record: వీడు.. మాములోడు కాదు.. ఏడోరోజుల్లోనే..

ABN, Publish Date - Jul 18 , 2024 | 06:28 PM

ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చూడాలంటే సమయం పడుతుంది. అందరూ అన్ని ప్రదేశాలను చూడలేరు. తక్కువ సమయంలో అస్సలు చూడలేరు. కొందరు మాత్రం రికార్డుల కోసం ముందడుగు వేస్తారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చుట్టొస్తారు. తక్కువ సమయంలో ఏడు వింతలను చూసి రికార్డ్ సృష్టించారు ఈజిప్ట్‌నకు చెందిన మాగ్డీ ఈసా. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు వింతలను తిలకించారు.

Guinness World Record

ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చూడాలంటే సమయం పడుతుంది. అందరూ అన్ని ప్రదేశాలను చూడలేరు. తక్కువ సమయంలో అస్సలు చూడలేరు. కొందరు మాత్రం రికార్డుల కోసం ముందడుగు వేస్తారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చుట్టొస్తారు. తక్కువ సమయంలో ఏడు వింతలను చూసి రికార్డ్ సృష్టించారు ఈజిప్ట్‌నకు (Egypt) చెందిన మాగ్డీ ఈసా. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు వింతలను తిలకించారు.


ఆరు రోజుల్లోనే..

మాగ్డీ ఈసా ఆరు రోజుల 11 గంటల 52 నిమిషాల్లో ప్రపంచంలోని ఏడు వింతలను చూశారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గ్రేట్ వాల్ చైనాతో అతని ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి తాజ్ మహల్, జోర్డాన్‌లో గల పెట్రా, రోమ్‌, బ్రెజిల్, పెరూ, మెక్సికోతో పూర్తయ్యింది. ఈసా పర్యటనకు సంబంధించిన వీడియోకు ప్రపంచంలో ఏడు వింతలను త్వరగా చూసొచ్చిన మాగ్డీ ఈసా అని గిన్నిస్ బుక్ రికార్డ్స్ క్యాప్షన్ రాసుకొచ్చింది. గతంలో ఈ రికార్డ్ జామి మెక్ డొనాల్డ్ పేరుతో ఉంది. అతని కన్నా మాగ్డీ ఈసా నాలుగున్నర గంటల ముందు వింతలను తిలకించాడు.


18 నెలలు కష్టపడ్డా..

‘ప్రపంచంలో గల వింతలను తక్కువ సమయంలో చూసి వచ్చేందుకు చాలా రోజులు శ్రమించా. దాదాపు 18 నెలల వరకు కష్టపడ్డా. విమానాలు, రైళ్లు, బస్సులు, సబ్ వే, నగరాల నుంచి వింత ప్రదేశాలకు వెళ్లేందుకు నడవడం ప్రాక్టీస్ చేశా. తన పర్యటనలో కలిగే చిన్న అంతరాయం షెడ్యూల్ మొత్తానికి ఇబ్బంది కలిగించొచ్చు. ప్రణాళిక ప్రకారం ముందడుగు వేశా, అనుకున్నది సాధించా అని’ మాగ్డీ ఈసా వివరించారు.

Updated Date - Jul 18 , 2024 | 06:28 PM

Advertising
Advertising
<