ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లైన్‌మెన్ షాకిచ్చిన హెడ్మాస్టర్.. స్కూల్‌లో అతడు చేస్తున్న అక్రమాన్ని ప్రశ్నించడానికి వెళితే..

ABN, Publish Date - Dec 16 , 2024 | 03:22 PM

కొందరు తాము చేస్తున్న పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, నిక్కచ్చిగా ఉంటారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనిపిస్తే అస్సలు సహించారు. ఆ క్రమంలో ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video

కొందరు వ్యక్తులు తమ పనులను చాలా నిజాయితీగా చేస్తారు. తాము చేస్తున్న పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, నిక్కచ్చిగా ఉంటారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనిపిస్తే అస్సలు సహించారు. ఆ క్రమంలో ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌ (Bihar)లో ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియలో ఓ లైన్‌మెన్ (Lineman) తన పని చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అక్రమాలకు పాల్పడుతున్న స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) అతడిని ప్రమాదానికి గురి చేశాడు (Viral Video).


@strugglewithkapil అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బీహార్‌లోని ఓ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు లైన్‌మెన్‌కు ఫిర్యాదు అందింది. స్కూల్‌కు బిగించిన మీటర్ నుంచి తన ఇంటికి కూడా కనెక్షన్ పెట్టుకుని ఉచితంగా విద్యుత్తు వినియోగించుకుంటున్నట్టు లైన్‌మెన్‌కు తెలిసింది. దీంతో ఆ లైన్‌మెన్ నేరుగా స్కూలుకు వెళ్లాడు. అప్పటికి స్కూలు టైమ్ అయిపోయింది. అయినా ఆ లైన్‌మెన్ నేరుగా హెడ్మాస్టర్ రూమ్‌‌కు వెళ్లి అక్కడున్న మీటర్‌ను తనిఖీ చేయడం ప్రారంభించాడు. అతడి ప్రయత్నాన్ని సదరు హెడ్మాస్టర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.


ఆ లైన్‌మెన్‌తో వాగ్వాదానికి దిగాడు. అయినా ఆ లైన్‌మెన్ వెనక్కి తగ్గలేదు. వైర్లను చెక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో తన అక్రమం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన హెడ్మాస్టర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. లైన్‌మెన్ నిల్చున్న కుర్చీని తోసేశాడు. దీంతో ఆ లైన్‌మెన్ కింద పడిపోయాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కొండచిలువతో అటలాడితే అలాగే ఉంటుంది.. ఆ వ్యక్తి పరిస్థితి ఏం జరిగిందో చూడండి..


Viral Video: పెళ్లి వేదికపై బావతో మరదలి సరసాలు.. వధువు పరిస్థితి చూస్తే నవ్వు రాక తప్పదు..


Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 16 , 2024 | 03:22 PM